త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’.. బీజేపీకి రాహుల్ గాంధీ వార్నింగ్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్‌లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటు హక్కును అక్రమంగా తొలగించారంటూ రాహుల్ గాంధీ గతంలో ఆరోపిస్తున్నారు.
ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..
కేరళలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు ఈ సారి పోలీసులనే టార్గెట్ చేశారు. పోలీసులను మోసం చేసేందుకు జిల్లా పోలీస్ అధికారి ప్రథీప్ టి.కే. పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ ను ఏర్పాటు చేసి.. పోలీసుల నుంచే డబ్బులు అడిగేందుకు యత్నించాడు. దీనికి సంబంధించి జిల్లాలోని కొందరు అధికారులకు వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ లు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇందులో ఓ ఉన్నతాధికారి ఫోటోను ప్రొఫైల్ ఫిక్ గా పెట్టి.. వేరే వారి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు.
యూఎన్ సిబ్బందిని బంధించిన హౌతీలు.. బందీలు ఎందరంటే..
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హౌతీల ప్రధానమంత్రితో సహా అనేక మంది సీనియర్ కమాండర్లు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రాజధాని సనా, హుదేయిదా అనే ఓడరేవు పట్టణంపై దాడి చేశారు. ఆదివారం ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి 11 మంది ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయని యెమెన్ భద్రతా అధికారులు చెప్పారు.
నిమ్స్‌లో ఉచిత గుండె ఆపరేషన్లు..!
మన సమాజంలో అత్యంత బాధ కలిగించే నిజం ఏమిటంటే, పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో చిన్నారులు బాధపడటం. ఆర్థికంగా బలమైన కుటుంబాలు పెద్ద ఆసుపత్రుల్లో ఆధునిక చికిత్స పొందగలిగినా, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చికిత్స కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రాణాలను కాపాడటానికి ఆర్థిక సహాయం కోసం ఇతరులను వేడుకోవాల్సి వస్తోంది.
సీబీఐ వద్ద పెండింగ్‌లో 7 వేలకు పైగా కేసులు..
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వద్ద పెండింగ్‌లో 7,072 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తాజాగా విడుదలైన కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 31, 2023 నాటికి ఈ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 379 హైప్రొఫైల్ కేసులు ఉన్నట్లుగా చెప్పింది. ఇవి 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1,056 కేసులు దర్యాప్తు దశలో ఉండగా, మిగతా 6,016 కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఈ నివేదికను సీబీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) సమర్పించింది.
బీఆర్‌ఎస్ అధికారిక వాట్సప్ గ్రూపుల నుంచి కవిత పీఆర్‌వో తొలగింపు
ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా కవిత పీఆర్‌వోను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించినట్లు సమాచారం. పార్టీ అంతర్గతంగా ఆమెపై వ్యతిరేక వాతావరణం పెరుగుతోందని ఇదే సంకేతమని భావిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికల్లోనూ కవితకు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లను ఫాలో అవుతున్న పలువురు నేతలు, కీలక కార్యకర్తలు అన్‌ఫాలో చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని, ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్‌ఎస్ భవిష్యత్తుపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.
కీలక నిర్ణయం.. వరద బాధితులకు పరిహారం ఆదేశాలు
భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత ఏడాది వర్షాల కారణంగా జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం మీద ఆయన ఆరా తీసుకున్నారు. సీఎం అధికారులు తక్షణమే కేంద్రానికి వివరాలు అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని చెరువుల పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం పేర్కొన్నారు. పంటలకు వచ్చిన నష్టం అంచనా వేయించి, తక్షణమే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వరదల సమయంలో గల నైపుణ్యాలను మరింత పెంపొందించాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ తో పని లేకున్నా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు.
‘‘భారత్ చాలా ఆలస్యం చేసింది’’.. సుంకాలపై ట్రంప్ బిగ్ కామెంట్స్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా 50 శాతం సుంకాలనున విధించింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
ఒక్క మ్యాచ్‌లో 27 సిక్సర్లు.. రింకు సింగ్ వీరవిహారం..
యూపీ టీ20 లీగ్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మ్యాచ్‌లు జరిగే కొద్ది నయా రికార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ లీగ్‌లో మనం ఓ హీరో గురించి మాట్లాడుకోవాలి.. ఆయనే రింకు సింగ్. యూపీ టీ20 లీగ్‌లో రింకు సింగ్ ఆధిపత్యం కొనసాగుతుంది. తాజాగా ఆగస్టు 31న నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఇదే మ్యాచ్‌లో నయా సంచలనం స్వస్తిక్ చికారా సిక్సర్లతో విరుచుకుపడ్డారు.