Kaleshwaram Project: కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరట!
- కేసీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట
- ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశాలు
- పిటిషన్ల విచారణ అక్టోబర్ 7కు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు.. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యంతర పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టు రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించినట్లు కోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ (ఏజీ) తీసుకెళ్లారు. కేసును తెలంగాణ సర్కార్ సీబీఐకి అప్పగించనున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ కేసీఆర్, హరీష్ రావుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Road Accident: లండన్ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతి.. ఐదుగురికి గాయాలు!
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిఫారసు చేసినట్టు చెప్పారు కదా? హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ విచారణ తర్వాత చర్యలు ఉంటాయని ఏజీ కోర్టుకు తెలిపారు. కమిషన్ రిపోర్ట్‌లో ఎవరిపైనా చర్యలు తీసుకోవాలన్న అంశం లేదని చెప్పారు. తదుపరి విచారణ వరకు ఇద్దరిపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ల విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. పీసీ ఘోష్ కమిషన్‌పై ఎంక్వైరీని క్వాష్ చేయాలని అడిగాం అని, ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించిందని కేసీఆర్, హరీష్ రావు తరఫు లాయర్ అర్యమ సుందరం తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..