సీఎం పదవి స్థాయి తగ్గించి పోకిరిలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో రాజనీతిజ్ఞుడిగా మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, అబద్దపు పునాదులు, అలవికానీ హామీల మీద ఏర్పాటైంది ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వంలో విడుదల చేసిన రూ. 7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాల్లో ఓడిన స్థానాల్లో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులే అక్కడ ఉన్నాయన్నారు. ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు గెలుపునకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. మనం…
Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే..అని బండి సంజయ్ అన్నారు. ఎంపీ నిధుల నుండి కరీంనగర్ జైలులో అంబులెన్స్ ,ల్యాబ్ అందించారు.
Big Breking: బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నెల 10న కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. నీ అయ్య ఎవడ్రా పడగొట్టేటోడు.. పడగొడతార్రా... ఎవడు కొట్టేది? అని దుయ్యబట్టారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం... ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తోన్న ప్రభుత్వం... ఇది ప్రజా ప్రభుత్వం.. వాడు అనుకుంటున్నాడు... లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందా అని…
యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటమి గెలుపుకు నాంది అని పేర్కొన్నారు. పాలకుల్లో అప్పుడే అసహనం కనిపిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న వారికి అహంకారం ఎక్కువైందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆ రోజు నల్గొండను ముంచి పులిచింతల ప్రాజెక్ట్ కట్టారని.. ఇప్పుడు కృష్ణాను కేఆర్ఎంబీకి అప్పగించారని హరీష్ రావు మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చిత్తశుద్ది…
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆటో డ్రైవర్ల సమస్యపై తన లేఖలో ప్రస్తావించారు. ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. ఆటోలకు గిరాకీ లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో ఏకంగా 15 మంది ఆటోడ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటే.. పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమైపోతోందన్నారు. ఆటోలు ఎక్కేవాళ్లు లేకపోవడంతో తమ కుటుంబం గడవని…
Kishan Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం నిన్న ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా..
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
Kaushik Reddy: తిట్లు తిట్టడం కాదు మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేలు పాడి కౌషిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో ఎక్కడైన ఒక్క ఉద్యోగం ఇచ్చి ఉంటె నా ముక్కు నెలకు రాస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. క్రొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డీ సిగ్గు శరం…