మేడిగడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఒక్క 3 ఫిల్లర్లు కుంగాయి.. అయితే వాటిని పునరుద్ధరణ పనులు చేయకుండా.. నాటి తమ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ డ్యామ్ పై మాకు అనుమానం వస్తుంది.. ఎందుకంటే వాళ్ళు కుంగిన ఫిల్లర్ల దగ్గరకు మళ్ళీ నీళ్లు వదులుతున్నారని తెలిపారు.
Jammu: జమ్మూలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం
డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు.. అయితే మళ్ళీ కుంగిన ఫిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగాలేదు అనిచెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు తమకు అనుమానం వస్తుందని చెప్పారు. రాజకీయ పరంగా కోపం ఉంటే తమపై రాజకీయంగా తీర్చుకోండి కానీ.. రైతుల పై మీ కోపం చూపించకండని తెలిపారు. ఇప్పటికే అనేక ఎకరాలకు సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి.. తమ ప్రాంతంలో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో వృధా అని చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్నారు.
YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: గుడ్‌న్యూస్.. రేపే వారి ఖాతాల్లో సొమ్ము జమ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను సూటిగా అడుగుతున్నా.. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలను వెంటనే అమలు చేయండని అన్నారు. మరోవైపు.. బీజేపీ గురించి ఆయన మాట్లాడుతూ, పదేపదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇతర నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటున్నారు.. అస్సలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం అని ఎవరు చెప్పారు.. మాది సెక్యులర్ పార్టీ.. మా కేసీఆర్ సెక్యులర్ నాయకుడు అని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరు అన్నారు.. వాళ్ళే మీడియాకు లీక్ లు ఇస్తున్నారు.. వాళ్లే పేపర్లలో రాపిస్తున్నారు.. వాళ్ళే వచ్చి మీడియాతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటున్నారని చెప్పారు.