తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇవాళ ఇరికేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కేసీఆర్ సభకు రావాలని, ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప, వాటి నాణ్యత గురించి పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు మంత్రి పొంగులేటి. అంతేకాకుండా.. అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, కాళేశ్వరం కు అన్నీ తానే అని చెప్పుకుంటున్నా కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టు డ్యామేజ్ పై చర్చ కు ఎందుకు రావడం లేదన్నారు మంత్రి పొంగులేటి.
Ranveer Singh : బాబోయ్..రణ్‌వీర్ సింగ్ ఒక్కో యాడ్ కు అన్ని కోట్లు తీసుకుంటాడా?
ఒకనాడు కేసీఆర్ కు దేవాలయం అయిన మేడిగడ్డ.. ఇప్పుడు బొందల గడ్డ ఎలా అయింది ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టును తొందర గా కట్టాలనే ఆతృత తప్ప..ప్రాజెక్టు నిర్మాణం లో క్వాలిటీ గురించి పట్టించుకోలేదని, ప్రాజెక్టు ప్రమాదం బీఆర్ఎస్ హాయాం లోనే జరిగింది.. ప్రమాదం జరిగిన తర్వాత నీటి ని ఎత్తిపోసారో లెక్కలు చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలిపోయింది..మరి ఆనాడు మేడిగడ్డ దగ్గర నీటిని ఎందుకు నిల్వ చేయలేదన్నారు. కనిపిస్తున్న దృశ్యాలను కూడా బీఆర్ఎస్ అంగీకరించడం లేదన్నారు. మూడు పిల్లర్లే కాదు..మరో మూడు ప్రాజెక్టులు డౌటేనన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొత్త ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదు.. సలహాలిచ్చే హక్కే ఉందన్నారు. గత సర్కార్ ప్రాజెక్టులపై దోపిడి చేసిందని ఆరోపించారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం..గర్భిణిపై గ్యాంగ్ రేప్ చేసి, నిప్పంటించారు..