Gangula Kamalakar: బీసీ కుల గణనతో బీసీ లే నష్టపోతారని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గణన చేస్తేనే బీసీ శాతం ఎంతో తేలిపోతుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అన్నీ వర్గాల సర్వే చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వాలని కోరారు. కుల గణన తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తీర్మానంపై బీఆర్ ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కుల గణనను పటిష్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా గంగుల ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా కుల గణనపై తీర్మానం చేయడమే కాకుండా చట్టం చేస్తే బాగుంటుందన్నారు.
Read also: Zomato Viral : జొమాటోలో నూడిల్స్ ఆర్డర్ చేస్తే.. వేడి వేడి బొద్దింక వేసి డెలివరీ చేశారు
భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కుల గణన చట్టం ఉండాలని, కోర్టు కేసులకు అవకాశం లేకుండా చూడాలని గంగుల సూచించారు. కుల గణన పూర్తయిన వెంటనే చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కుల గణన తర్వాత ఎలాంటి పథకాలు అమలు చేస్తారో చట్టం ముందుగా చెప్పాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రిజర్వేషన్లు 50 శాతం మించిపోతే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని గంగుల ప్రశ్నించారు. చట్టసభల్లో 50 శాతం ఎమ్మెల్యేలు ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ఎంబీసీలను తొలిసారిగా గుర్తించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని గంగుల అన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని సూచించారు. బీసీ సబ్ ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో ఇప్పుడే కుల గణన జరిగిందని, అయితే న్యాయపరమైన చిక్కులు వచ్చాయని గుర్తు చేశారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్