Kcr 70th Birthday: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్.. మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.. తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు పని చేశారు. నేడు కేసీఆర్ 70వ బర్త్ డే నేడు.. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు రెడీ అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం ఎప్పటిలాగే చేసేందుకు పార్టీ కార్యకర్తలు రెడీ అయ్యారు.
Read Also: LIC : ఎల్ఐసీ కొత్త బీమా ప్లాన్.. అమృతబల్ లాంచ్
మరో వైపు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 1000 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను బహుమతిగా ఇవ్వాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఏడాదికి లక్ష రూపాయల బీమా కవరేజీని అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు శారీరక వికలాంగులకు బీఆర్ఎస్ వీల్‌చైర్‌లను అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే, కేసీఆర్ జీవితంపై “తానే ఒక చరిత్ర” (ఆయన చరిత్ర వ్యక్తి) అనే డాక్యుమెంటరీతో కేసీఆర్ చిన్ననాటి నుంచి ఇటీవల జరిగిన ‘ఛలో నల్గొండ’ సభ వరకు ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన జీవితంపై 30 నిమిషాల డాక్యుమెంటరీని ఇవాళ విడుదల చేయనున్నారు.
Read Also: Saturday Special Govinda Namalu: శనివారం నాడు గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి..
ఇక, హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో సహా సీనియర్ నేతలందరూ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించి ఈ రోజు ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్‌కు భారీగా చేరుకోనున్నారు.