Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవన్ పాయింట్ ప్రజేంటేషన్ ఇస్తున్నారు. కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజ్.. దురదృష్టవశాత్తు నాణ్యత లోపంతో కుంగిపోయింది.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ని విచారణ జరిపించాలని కోరాము అని ఆయన తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ 1800 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు.. కానీ, 4500 కోట్ల రూపాయలకు పెరిగింది అని చెప్పుకొచ్చారు. అదే వర్క్ అదే ఏజెన్సీకి ఎంత కాస్ట్ పెంచి అవినీతికి పాల్పడిందో అర్థం అవుతుంది అని మంత్రి ఆరోపించారు. ఇంత అవినీతి దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు.. గత ప్రభుత్వం పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్, చీఫ్ డిజైనర్.. ఎన్డీఎస్ఏ (NDSA) నివేదిక ప్రజలకు తెలియాలి కాబట్టి బయట పెడుతున్నాం అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: New Jersey : న్యూజెర్సీలో అగ్ని ప్రమాదం.. సమీపంలో భారీ సంఖ్యలో భారతీయులు
ఇక, నాసిరకం నిర్మాణం, డిసైన్ లోపం అని ఎన్డీఎస్ఏ (Ndsa) స్పష్టం చేసింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటెషన్ లో తెలిపారు. అక్టోబర్ లో కూలితే.. డిసెంబర్ 7వ తేదీ వరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. Ndsa క్వాలిటీ కంట్రోల్ లేదని స్పష్టం చేసింది.. 2019లో బ్యారేజ్ పూర్తి అయింది.. తనిఖీలు ఏం చేయలేదు.. రిజర్వాయర్ నింపొద్దు అని NDSA స్పష్టం చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. అన్నారంలో కూడా నిన్నటి నుంచి లికేజ్ లు పెరిగాయి.. అన్నారం లో కూడా క్రాక్స్ ఉన్నాయి.. అన్నారంకి NDSA వాళ్ళు రెండు రోజుల్లో వస్తారు.. కట్టిన వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి మాపై ఎదురు దాడి చేస్తున్నారు.. మేడిగడ్డ లెక్కనే అన్నారం ప్రమాదంలో ఉందని NDSA చెప్పింది.. CAG నివేదిక ఆధారంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Alluarjun : పుష్ప 3 కూడా ఉండొచ్చు.. కన్ఫామ్ చేసిన ఐకాన్ స్టార్..
అయితే, కాళేశ్వరం ఆర్థికంగా కూడా అనుకూల మైనది కాదు అని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లుకు వేళా కోట్లు కట్టబెట్టింది.. పిక్ ఎనర్జీ డిమాండ్ రోజు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం.. తెలంగాణలో మొత్తానికి అవసరము అయ్యే కరెంట్, కాళేశ్వరం ఒక్కడానికే కావాలి.. విద్యుత్ చార్జీలు 10, 374 కోట్లు ఏడాదికి అవుతోంది.. 25 వేల కోట్ల రూపాయలకు ఇప్పటికి అనుమతి ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. మల్లన్న సాగర్ విషయంలో అనేక లోపాలరె కాగ్ చూపెట్టింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లను కట్టబెట్టి.. దక్షిణ తెలంగాణకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.