Malla Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీలో మాజీ మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు.. జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఇచ్చేందుకు చూస్తున్నామని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాహుల్ గాంధీ మాటకు అనుగుణంగా బీసీ కుల జన గణన చేస్తున్నామన్నారు.
పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఈసీ సమావేశంలో అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా… తెలంగాణ ప్రజల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పిందని, కానీ.. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను…
తెలంగాణ రాష్ట్ర హై కోర్టు మరో కీలక తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇవాళ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. దాసోజీ శ్రావణ్, సత్యనారాయణ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది.
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన నర్సంపేట ఛైర్మెన్ గుంటీ రజినీ కిషన్ పై అవిశ్వాస తీర్మనాన్ని ప్రవేశ పెట్టి కలెక్టరేట్ లో కొంత మంది కౌన్సిలర్లు సమర్పించారు.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరు అధైర్య పడవద్దు….119 సీట్లలో 39 సీట్లు గెలిచినం…బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. 14 సీట్లు ఐదు వేల ఓట్లతో ఓటమి పాలైనం…అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదని, 14 ఏళ్ళు అభివృద్ధి బాటలో కారు వంద కిలోమీటర్ల స్పీడ్ తో పోయిందన్నారు కేటీఆర్. కారు సర్వీసింగ్ కు పోయింది… మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తదని,…
బీజేపీ మహిళ స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓస్ సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ లోని ఓ హాల్ లో నిర్వహించిన కార్యశాల కార్యక్రమానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1998లో స్వయం సహాయక సంఘాల కాన్సెప్ట్ ను వాజ్పేయి ప్రవేశ పెట్టారన్నారు. ఇప్పుడు వేలాది స్వయం సహాయక సంఘాల ఏర్పడ్డాయని, ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసినా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం…
ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో స్వేచ్ఛ లేని పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాను.. పాదయాత్ర ద్వారా ఉద్యమం చేశాను.. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేశానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మాట్లాడితే కేసులు ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనను ఉప ముఖ్యమంత్రిని చేసి…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడా నుండి తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో ఉండే కేటీఆర్.. ఆటో ఎక్కడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫొటోలు, వీడియోలు తీశారు. కేటీఆర్ తో పాటు.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు.