రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, 16వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, 20వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
Venkatesh Netha: బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందంలో ఉందని మాజీ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ వన్ అధికారిగా 18 సంల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
రాజ్యాంగ బద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడుపడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి మధుయాష్కీ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత…
దక్షిణ తెలంగాణ లీడర్లతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సంద్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈనెల 13 న నల్లగొండ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు… నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇదంతా పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడం తో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ లు ఆధీనం లోకి వెళితే తెలంగాణ…
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు.
దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు ఛాయాలకు కేసీఆర్ కారణమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హాంతకుడికి, పనికిరాని వ్యక్తి జగదీష్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి…