Kishan Reddy: తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెరమీదకు తెస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె పీఎల్ అలేఖ్య, వారి అనుచరులతో కమలం పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Read Also: Rahul Gandhi: లంచాలు, కమీషన్ల కోసమే ఎలక్టోరల్ బాండ్లు.. కేంద్రంపై రాహుల్ ఆగ్రహం..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
పార్టీకి పెరుగుతున్న బలం
తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె అలేఖ్య, వారి అనుచరులతో పార్టీలో చేరడం పార్టీకి బలం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి, ప్రధాని మోడీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా.. ఈసారి తమ ఓటు బీజేపీకి, మోడీకి వేస్తామని రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని తెలిపారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లేని అంశాలను తెరమీదకు తెస్తూ.. మోదీ అనుకూల వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వచ్చేది మోదీ ప్రభుత్వమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ అన్నివర్గాల ప్రజలను కోరుతున్నాను బీజేపీని బలపర్చాలి”అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
సేవాలాల్ చూపిన బాటలో నడవాలి..
నేటి యువత సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంత్ సేవాలాల్ జయంతిని దేశ వ్యాప్తంగా బీజేపీ వైభవంగా నిర్వహిస్తున్నదన్నారు. బ్రిటీష్ వారు అధికార దుర్వినియోగంతో మత మార్పిడులకు పాల్పడ్డారని, దానికి వ్యతిరేకంగా సంత్ సేవాలాల్ పోరాటం చేశారని గుర్తు చేశారు. సంతు సేవాలాల్ తెలుగు రాష్ట్రాల్లో జన్మించి.. ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. బంజారా సమాజం హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం బీజేపీ పని చేస్తుందన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!