హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. బీజేపీ గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారని, రేవంత్ రెడ్డి పాలనలో కేటీఆర్ కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, మైనంపల్లి కేటీఆర్,హరీష్ రావులపై దాడులు చేస్తామని అంటున్నారని, రేవంత్ రెడ్డి కొట్టండి,చంపండి అనే మాటలను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు దాసోజు శ్రవణ్. కొండా సురేఖ మాటలు రాజకీయాలు అంటే అసహ్యం వేస్తోందని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కొడుకుని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారన్నారు. కేటీఆర్ పదేళ్లు రాష్ట్ర మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నారని, కొండా సురేఖ రాజకీయం కోసం సినిమా పరిశ్రమ వాళ్ళను అవమానించారని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళను తప్పుడు వ్యక్తులుగా మంత్రి కొండా సురేఖ చిత్రీకరించారన్నారు. కొండా సురేఖను రాహుల్ గాంధీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, కొండా సురేఖ సమంత,నాగార్జున కాళ్ళు మొక్కి క్షమాపణ కోరాలన్నారు దాసోజు శ్రవణ్.
Read Also : Delhi Drug Case: రూ. 5000 కోట్ల డ్రగ్స్ కేసు.. ప్రధాన సూత్రధారితో కాంగ్రెస్‌కి సంబంధం..
అంతేకాకుండా..’మొన్నటి వరకు ఆంధ్రాలో చూసిన కల్చర్‌ను రేవంత్ రెడ్డి తెలంగాణకు తీసుకువస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు. మూసీ సుందరీకరణపై పాలసీ డాక్యుమెంట్ ఉందా…? మూసీ నది రేవంత్ రెడ్డి స్వంత జాగీరు కాదు. మూసీ సుందరీకరణపై పరివాహక ఎమ్మెల్యేలతో మీటింగ్ ఎందుకు పెట్టలేదు. దేశాన్ని ఉద్దరిస్తున్నట్లు కూలుస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. జీహెచ్ఎంసీకి సంభంధం లేకుండా రేవంత్ రెడ్డి హైడ్రాను పెట్టుకున్నారు. మూర్ఖత్వాన్ని వీడాలి. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ నినాదం రేవంత్ రెడ్డికి తెలియదు. ఫార్మ్ హౌస్ లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చండి.
ఇల్లీగల్ నిర్మాణాలను కూల్చాలంటే ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి. జీహెచ్ఎంసీని నిర్వీర్యం చేసి హైడ్రా అథారిటీని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకే మూసీ ఉండాలా…? మూసీ ఎప్పుడూ ఉండాలంటే రాజ్యాంగబద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆఫీసు చెరువులో ఉందని అంటున్నారు. భూసేకరణ పరిహారం చట్టం 2013 లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో చేసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారు.’ అని దాసోజు శ్రవణ్ అన్నారు.
Read Also : Ashok Tanwar: మాజీ ఎంపీ జిమ్మిక్కు.. గంట క్రితం బీజేపీ ర్యాలీలో.. కట్‌చేస్తే.. వేదికపై రాహుల్ గాంధీతో..