సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆదిలాబాదు నుండి ఖమ్మం వరకి పాదయాత్ర చేసానని, మీ అందరి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజల ఆశయాలని చట్టాలుగా మార్చి పని చేస్తుంది మా ప్రభుత్వమని, ప్రాజెక్టుల కొసం భూములని ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి.అందుకే నిధులు విడుదల చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. రెండు లక్షలు రుణమాఫి చేస్తానని మాట ఇచ్చాం చేసి చూపామని, హామీ ఇవ్వకున్నా 2 లక్షల పైన ఉన్న…
గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థుతులు అందరికీసని ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని తెలిపారు.
Harish Rao: తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీష్ రావుకు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏఐజీ వద్దకు వెళ్లేందుకు
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొకపెట్ లోని హరీష్ రావు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. ఈ వ్యవహారం తెలంగాణలో హీట్ పెంచింది.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, లక్ష్మారెడ్డి, మాగంటి గోపినాథ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి చేశారు.. ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో.. తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో.. తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన చేస్తున్నారు.