TPCC Chief Mahesh Goud: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం, ఓట్ల బిక్షాటన చేస్తున్నారు అని మండిపడ్డారు. కులం, మతం, శ్రీరాముడు, హనుమంతుడు పేర్లతో ఓట్లు అడుగుతున్నారని అన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజల కోసం వెళ్తున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ కు ప్రజలు అండగా నిలవండి కోరారు. పెద్ద పెద్ద కంపెనీలు అదాని, అంబానీలకీ కట్టబెట్టారు అని ఆయన ఆరోపించారు. అప్పులు చేసి కేసీఆర్ ఫాంహౌస్ కు పరిమితం అయ్యారు.. ఇక, కేటీఆర్, హరీశ్ రావు అబద్దపు మాటలు మాట్లాడుతున్నారు.. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా అవసరమా..? అని మహేష్ కుమార్ గౌడ్ అడిగారు.
Read Also: Harsha Sai Father: హర్ష సాయి తండ్రికి హైకోర్టు షాక్
ఇక, పీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరి వరకు ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీతో ఆహ్లాదకరమైన పోటీ పడ్డామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆఖరి వరకు పోటీ ఉన్న కలిసి పోయే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి.. మధు యాష్కీ నాకు పెద్దన్న లాంటి వారు.. రాజకీయ విభేదాలు ఉన్న డీఎస్ నా రాజకీయ గురువే అని చెప్పుకొచ్చారు. నేను రాజకీయ కుటుంబం నుంచి రాలేదు, మాది వ్యవసాయ కుటుంబం.. నక్సల్ ప్రభావిత ప్రాంతం నుంచి నిజామాబాద్ కు వచ్చాను.. రాజకీయాల్లో పనీ చేసుకుంటూ అవకాశం వస్తుంది అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.