వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టడం రాష్ట్ర రైతంగాన్ని మోసం చేయడమే అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా పోయినట్లే అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇచ్చిన ప్రకటన కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం లో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వానాకాలం పంట సీజన్ కు రైతులకు రైతుబంధు వస్తుందన్న ఆశ ఆడియశలు అయ్యాయన్నారు.
Harish Rao: మహిళకు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు తప్ప అన్ని తుస్సు మన్నాయి..
రైతుబంధు ను ఈ ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది అని అన్నారు. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టికొట్టింది ఈ ప్రభుత్వం అని అన్నారు. ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతులెత్తెస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం చేతగాని తనం తో రైతన్నలనుమోసం చేస్తామంటే బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదని ప్రతిపక్ష పార్టీ గా ప్రశ్నిస్తుందని అన్నారు. ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వెయ్యాలని ఇచ్చేవరకు రైతుల పక్షాన ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.
YS Jagan: లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. బద్వేల్ ఘటనపై జగన్ ట్వీట్