Kunamneni Sambasiva Rao: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరికీ ఒక్క అజెండా ఉంది.. అందుకే ఈ ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. వాల్ల ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున రభస చేస్తున్నారు.. రాబందుల్లా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యానించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ పని తీరు ఉందన్నారు.
ప్రజలు ఆశివదించిన ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. హైడ్రా పేద వాళ్ళ జోలికి వెళ్ళడం లేదన్నారు. పేదవారి భుజం మీద తుపాకీ పెట్టీ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వంను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ముందు ల్యాండ్ గ్రాబర్స్, పెద్ద వారి నుండి వస్తె.. అప్పుడు పేదవాళ్లకు కొంత భరోసా కలుగుతుందన్నారు. పేద వాళ్లకు రక్షకులుగా కలరింగ్ ఇస్తున్నారు..కానీ పెద్ద వారిని రక్షించాలని ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు పలువురు నాయకులని తెలిపారు. బీజేపీ ట్రాప్ లో బీఆర్ఎస్ పడుతుందన్నారు. ప్రభుత్వం లక్ష్యం గురి తప్పుతుందన్నారు.
Read also: కాకరకాయతో శరీరంలోని సగం రోగాలు మాయం!
కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉన్నాం, అదే సమయంలో పేద వాళ్లకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం కు హడావిడి గా చేయాల్సిన అవసరం లేదు.. అలా చేస్తే, నిజమైన వారు తప్పించుకుంటారన్నారు. 100 మంది దొంగలు తప్పించుకున్న, ఒక్క నిర్దోషి శిక్షించబడొద్దని సూచించారు. హైడ్రా మంచికి ఉపయోగిస్తే, మేము సపోర్ట్ చేస్తామని తెలపిఆరు. మూసి నీళ్ళతో పంటలు పండుతాయి.. కానీ అవి తినే పరిస్థితి లేదని నల్గొండ వసూలు చెప్తున్నారన్నారు. మేధావులు, రాజకీయ నాయకులు, వాతావరణ ప్రియులు అందరితో కలిసి ఒక్క మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పేదవారి ఇళ్లు కూల్చాలని నిర్ణయం తీసుకుంటే, వారికి ప్రత్న్యయం చూపాలన్నారు. భూములు కొనుక్కున్న వారికి ఖాళీ చేయించాలని పరిస్థితి వస్తె.. వారి అప్పటి వరకు ఖర్చు పెట్టిన దాని కంటే మంచి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. భూ కబ్జా వారు ఎంత మంది ఉన్నారని గుర్తించాలన్నారు. ప్రభుత్వ స్థలంలో అనేక మంది గుడిసెలు వేసుకొని ఉన్నారు.. అలా ఉన్న పేద వారి జోలికి వెళ్లొద్దని తెలిపారు. హైడ్రా వల్ల పేద వారి జోలికి వెళ్లొద్దు, పెద్ద వాడి గుండెలు అదరాలన్నారు. ఒక్క శ్వేత పత్రం విడుదల చెయ్యాలి.. అందులో మాఫియా చేసే వారి ఎంత మంది అన్నారు లెక్క తీయాలన్నారు.
Read also: Kishan Reddy: హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు..
ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ వారు ఉంటే వారి లెక్క కూడా తీయాలన్నారు. రూ.20 లక్షల మందికి రుణ మాఫీ ఇవ్వాల్సి ఉంది.. అతి ఉత్సాహంతో పూర్తి స్థాయిలో రైతులకు ఇవ్వలేకపోయారన్నారు. టార్గెట్ పెట్టుకోవడం వల్ల అతి ఉత్సాహం వల్ల అనేక మందికి రుణమాఫీ కాలేదన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది, అవి కూడా ప్రభుత్వం కట్టాలన్నారు. డబ్బులు ఉన్నాయి, లేవు అని జనాలకు చెప్పి రుణమాఫీ చెయ్యాలన్నారు. రుణ భరోసా ఇప్పుడు ఇవ్వలేక పోతున్నాం అంటున్నారు.. అవి బకాయిలు కింద పెట్టీ ,తర్వాత అయిన ఇవ్వాలన్నారు. బీసీ కులగణన చేయాల్సిందే.. తర్వాత.. ఎస్సీ లెక్క తీయాలని సూచించారు. ఎంత మంది పిల్లలను బీఆర్ఎస్ వాళ్లు ప్రభుత్వంలో ఉన్నపుడు కొట్టించారన్నారు. పిల్లల కోసం మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. అపర్ణ అనే సంస్థ మాఫియా ల తయ్యారైంది..వారి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయబోతున్నాం..అక్కడ ఎర్ర జెండాలు పెట్టబోతున్నామన్నారు. పౌర హక్కుల కోసం నిలబడ్డా వారు ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ,ఇపుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని తెలిపారు. పోలీసులు కనీసం డెడ్ బాడీని పార్టీ ఆఫిస్ లో పెట్టనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Group 1 Exams: రేపే గ్రూప్ 1 మెయిన్స్.. 46 పరీక్షలు కేంద్రాల వద్ద భారీ భద్రత..