ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్ రావు మండిపడ్డారు.…
తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరు. అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్ గా రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రతి నెల సగటున 6 వేల కోట్ల…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ పనికట్టుకుని బురద జల్లే పనిలో పడ్డారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వాళ్ళమని, కానీ కేటీఆర్.. హరీష్ లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కనిపించడం లేదు.. ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనేది అర్దం అవ్వడం లేదని ఆయన అన్నారు. గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండని,…
అధికారంలో ఉన్నప్పుడు ఆ అవసరం రాలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక అక్కెరకొచ్చింది. అందుకే సెట్ చేసే పనిలో పడ్డారు. రండి బాబూ రండి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పనిలో పడ్డారట. దసరా తర్వాత గులాబీశిబిరంలో పందేరమే అంటున్నారు. డిసెంబర్లో గులాబీ బాస్ ఫాంహౌజ్ వీడుతారని చెబుతున్నారు! కాంగ్రెస్ ప్రభుత్వానికి యేడాది టైం ఇచ్చిన తర్వాత ఎటాక్ చేద్దామనే వ్యూహంలో బీఆర్ఎస్ ఉందట! ఆ క్రమంలోనే పార్టీ రూట్ లెవల్లో సెట్ చేద్దామనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడాని ఎదురు…
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ…
కాశ్మీర్ లో వంద శాతం టార్గెట్ రిచ్ అయ్యామని, హర్యానాలో EVM టాంపరింగ్ జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదు? కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో EVM టాంపరింగ్ ఎందుకు జరగలేదన్నారు కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూలో ఒక రకంగా ఓటర్ల పోలరైజ్.. కాశ్మీర్ లో మరోరకంగా పోలారైజ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రశాంతంగా అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికల ఇవి అని, హర్యానా ఎగ్జిట్…
ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.' విద్యార్థుల ముందు, గురువుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు @TelanganaCMO. గడిచిన పది నెలలలో కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..?. మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమా లేక పార్టీ కార్యక్రమా అని ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారు.
Madhu Sudhan Reddy: కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని.. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే సంబురాలు చేసుకుంటున్నాడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బీజేపీ గెలిచిందని సంకలు గుద్దుకుంటుండని., అక్కడ ఈవీఎంలు అవకతవకలు త్వరలో బయట పడతాయని., కాశ్మీర్ లో బీజేపీ ఓడిపోతే చప్పుడు చెయట్లేదని., రాహుల్ గాంధీ పై కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మోరిగే కుక్క కరవదు. కేటీఆర్ మాటలు ఎవరు పట్టించుకోరని., కేటీఆర్…