ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగులకు వేలాది రూపాయల జీతం చెల్లిస్తాయి. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచం తీసుకున్న ఉద్యోగి వీడియోను ఓ వ్యక్తి తీయడంతో ఆ ఉద్యోగి అతడి కాళ్లు పట్టుకున్నాడు. క్షమించమని ప్రాథేయపడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపిస్తోంది. దీనిపై వందలాది మంది స్పందించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన మోడల్ తహసీల్ నుంచి నివేదించబడింది.
READ MORE: Mirai: మిరాయ్ కోసం మరో కుర్ర డైరెక్టర్?
ఈ వీడియో ప్రారంభానికి ముందు.. ఒక ఉద్యోగి ‘కిసాన్ సమ్మాన్ నిధి’ని విడుదల చేయడానికి బదులుగా లంచం అడిగాడు. దీంతో ఆ వ్యక్తి వీడియోను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. లంచం డబ్బులకు ఉద్యోగి టేబుల్‌పై పెట్టినట్లు వీడియోలో కనిపించింది. వీడియో తీస్తున్నట్లు గుర్తించిన ఉద్యోగి వెంటనే తన సీటులోంచి లేచి వీడియో తీస్తున్న వ్యక్తి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాడు. అయితే వీడియో తీసే వ్యక్తి మాత్రం లంచం తీసుకోవడం గురించి ఉద్యోగిని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఆ ఉద్యోగి పేరు అడిగ్గా.. తాను ఎన్నికల విభాగంలో పనిచేసే అంకుర్ ప్రజాపతి అని చెప్పాడు. దాదాపు 2 నిమిషాల 20 సెకన్ల ఈ వైరల్ క్లిప్‌లో… వ్యక్తి లంచం పేరుతో ఉద్యోగికి నోట్‌ను ఇచ్చాడు. అధికారి ముందు తేలిగ్గా రుజువు అయ్యేలా సంతకం చేశాడు. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. లంచం, అవినీతి మన వ్యవస్థలో పరిపాటిగా మారిందని వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగులకు తగిన శిక్ష విధించాలని అప్పుడే మిగతా ఉద్యోగులు చక్కగా పనిచేస్తారని కోరుతున్నారు.
READ MORE:MLA Brahmananda Reddy: నాపై విచారణ చేయించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా.. జూలకంటి సంచలన వ్యాఖ్యలు
बलिया की मॉडल तहसील में किसान सम्मान निधि जारी करने के एवज़ में रिश्वत माँगने का वीडियो वायरल। पैर पकड़ कर माफ़ी माँगने पर भी नहीं बनी बात। pic.twitter.com/8THOUDY4un
— SANJAY TRIPATHI (@sanjayjourno) October 25, 2024