Medchal: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సై, సీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medchal: మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కుషాయిగూడకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమికి సంబంధించి మరో వ్యక్తి భూ సమస్యపై గొడవలో భాగంగా రెవెన్యూ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులపై భరత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో అతనిపై ఉన్న కేసుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు.
Read Also: Kidnap: చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు అరెస్ట్
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
అయితే ఇందులో ఓ కేసుకు సంబంధించి భరత్ రెడ్డిపై కేసు పూర్తిగా తొలగించడానికి గాను మధ్యవర్తి ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిలు మూడు లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. అన్ని మాట్లాడుకున్న తర్వాత శుక్రవారం నాడు భరత్ రెడ్డి కుషాయిగూడలోని తన కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా మూడు లక్షలు రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామి, మధ్యవర్తి ఉపేందర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆనంద్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!