Bribe : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల రామగుండం కు చెందిన ఆలకుంట మహేష్ తన ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకొని ఎమ్మార్వో కు అప్పగించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎమ్మార్వో ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలంటే 25 వేల డీడి తో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎమ్మార్వో, ఆర్ఐ డిమాండ్ చేశారు. దీంతో మహేష్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈరోజు 25 వేల డీడి తో పాటు 12,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీధర్ ను పట్టుకున్నారు. వెంటనే డబ్బులు పడవేసి శ్రీధర్ పరారైనట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిలో బాధ్యుడైన ఎమ్మార్వో ను విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి స్పష్టం చేశారు.
Brazil: బ్రెజిల్‌కి గెస్ట్‌గా వెళ్తే గోల్డ్ చైన్ చోరీ.. భోరున విలపించిన లిసిప్రియా
కాగా ఇదే ఎమ్మార్వో గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. అలాగే అంతర్గాం లో మూడేళ్ల క్రితం భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పెద్దంపేట శంకర్ నుంచి అప్పటి ఎమ్మార్వో సంపత్, ఆర్ఐ హాజీమ్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే తనను ఎమ్మార్వో, ఆర్ఐ మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఆలకుంట మహేష్ తెలిపారు. ఈ క్రమంలోనే 25వేల డీడీ అదనంగా 12,000 ఎమ్మార్వో కు ఇచ్చేందుకు వెళ్లగా ఆర్ఐకి శ్రీధర్ ను కలిసి ఇవ్వమన్నాడని బాధితుడు పేర్కొన్నారు.
Brazil: బ్రెజిల్‌కి గెస్ట్‌గా వెళ్తే గోల్డ్ చైన్ చోరీ.. భోరున విలపించిన లిసిప్రియా