ఉరుకులు పరుగుల మహానగరంలో చిన్నారులతో కలిసి కొంత ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం ‘సన్డే ఫన్డే’ ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ వంటి కార్యక్రమాలను చేపట్టింది. అయితే భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్‌పై స్పష్టత వచ్చిన తరువాత మళ్లీ ఈ కార్యక్రమాలు…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11 ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను రైతులు ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ సరిహద్దులు సింఘూ, టిక్రి, గజీపూర్ లలో సంవత్సరంపైగా ఆందోళన చేపట్టిన రైతులు శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం కానున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ సంఘం పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైతు…
ఏపీలో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో, లక్ష కోట్లు 20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుసునని అన్నారు. అంతేకాకుండా మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని, చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ…
ఏపీలో ఓటీఎస్‌పై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంపై మీడియా పేరుతో కొన్ని సంస్థలు టెర్రరిజం చేస్తున్నాయంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని, ఈ పథకం వల్ల పేదలకు జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం కనీసం వడ్డీ…
మహానగరంలో మాయగాళ్లకు కొదవేలేదు అంటుంటారు. ఎందుకంటే.. రోజురోజుకు భాగ్యనగరంలో కొత్తకొత్త రూపాల్లో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి. అందులో అక్రమ నిర్మాణాలు కూడా ఒకటి. అయితే హైదరాబాద్‌లో నకిలీ ధృవప్రతాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాల పై కొరడా ఝుళిపించేందుకు అధికార యంత్రాగాన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30 లోపు అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయాలని హెచ్ఎండీఏ పరిధిలోని మునిసిపల్ కమిషనర్…
టీఆర్ఎస్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే టీఆర్ఎస్ నేతలు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయం స్థానిక నేతలకు తెలిసినా వారి మధ్య సంది కుదిర్చేందుకు సహాసించలేదు. అయితే నేడు సబితా ఇంద్రారెడ్డి ముందే ఇరు వర్గాల నేతల…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెంది దాని ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాకుండా ఇటీవల భారత్‌లోకి కూడా ఈ డేంజరస్ వైరస్ ప్రవేశించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) డేటా ప్రకారం.. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 మధ్య, కోవిడ్ ఇన్ఫెక్షన్లలో 34.9 శాతం 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలే ఉన్నారని…
గత రెండు సంవత్సరాలు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ పలు దేశాలకు వ్యాప్తి చెందడంతో విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారికి కరోనా పరీక్షలు మరింత ముమ్మరంగా వైద్యులు చేస్తున్నారు. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కావలికి…
కరోనా మహమ్మారి రోజురోజు కొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు, దాని నివారణకై శాస్త్రవేత్తలు ఇప్పటికే తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ఆరోగ్య అధికారులు బుధవారం…
ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ వైద్యసేవలను విస్తృతం చేయడంలో భాగంగా కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన మూడో అంతస్తును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ , ఆర్ఈఐటీ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)ల చొరవతో 100 పడకల సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్‌ను…