దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్సై డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరా లను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని ఎస్సై, కానిస్టేబుల్ కొట్టిన వ్యవహారం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఎస్పీ రంగనాధ్ దృష్టికి రావడంతో రెండు రోజుల క్రితం ఘటనపై సమగ్ర విచారణ కోసం డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలల్లో గంప గోవర్థన్ రూటే సపరేటుగా ఉంటుంది. ఆయన దేనిపైన స్పందించినా తన దైనతీరుతో వెళ్తుంటారు. తాజాగా ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే అయిన గంప గోవర్థన్ కలెక్టరేట్ కి రైతులతో పాటు ధాన్యంలోడ్‌తో ఉన్న లారీ తీసుకువచ్చారు. 3వ తేదీ నుండి రైతులను రైస్ మిల్ యజమానులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తి చేశారు. జిల్లా లో కొందరు రైస్ మిల్స్ యజమానులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, జిల్లాలో మిగిలిన 20 శాతం ధాన్యం…
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల అక్రమణ కేసుపై ఈటల జమున మీడియా మాట్లాడారు. చట్టపరంగానే భూములు కొన్నామని ఈటల జమున వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈటల జమున మాటలపై స్పందిస్తూ.. సర్వే నంబర్ 130 లో పట్టా ల్యాండ్ లేదని వెల్లడించారు. ఈటల జామున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్ట విరుద్ధమైన పత్రమని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామరావు దగ్గర నుండి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గని వలన వ్యవసాయ భూములు కోల్పోయిన తమకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించడం లేదని కొంతకాలంగా ప్రజాప్రతినిధులు అధికారులను ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగడం లేదని బాధితుడు సుందర్ తో పాటు కుటుంబం నిరసనలు వ్యక్తి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని న్యాయం కోసం ప్రధానిని కలిసేందుకు సుందర్ కుమారుడు సంజయ్ ఆరు రోజులు బైక్ పై ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నాడు. గతంలో ఎడ్లబండి మీద…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేడు సంతోష్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా కేసీఆర్ తనను చిన్నప్పుడు భుజాలపై ఎత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. “ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది …” అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో నెట్టింట ఈ పిక్ వైరల్‌గా మారింది. అంతేకాకుండా టీఆర్ఎస్ అభిమానులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు…
కరోనా మహమ్మారి ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వేరియంట్ ఇప్పటికే భారత్‌లో ప్రవేశించేసరికి విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి గత నెలలో వచ్చిన వారిని ట్రేసింగ్ చేసి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఉమిలాడా గ్రామంలో అర్జాల గోపాల కృష్ణ (51) అనే వ్యక్తి గత నెల 23న…
తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజమాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణంలో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. భీంగల్ పట్టణానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసుకునేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలో మంచి పేరు తెలంగాణ తెచ్చుకుందని, ఇవన్నీ పక్కన పెట్టి కొందరు బీజేపీ నాయకులు రాజకీయం మాట్లాడుతున్నారని…
వివాదాస్పద షియా ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల దాస్నా ఆలయంలో ఇస్లాం మతం వీడి హిందు మతం స్వీకరించారు. ఆలయ పూజారి యతి నర్సింహానంద సరస్వతి ఆచారాలను నిర్వహించి వసీం రిజ్వీని హిందు మతంలోకి మార్చారు. అయితే అనంతర రిజ్వీ పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చినట్లు తెలిపారు. త్యాగిగా పేరు మార్చుకున్న రిజ్వీ మాట్లాడుతూ.. ఏ మతాన్ని అనుసరించాలనేది తన ఇష్టమని, కాబట్టి ప్రపంచంలోని…
టీడీపీ నేత పట్టాభిరామ్ మరోసారి సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఙల్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు. ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి…
డా. బీఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని మా నాయకుడు ఎన్టీఆర్ స్థాపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆంశాలు భారతదేశానికే కాకుండా చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అంబేద్కర్ దేశశిల్పి అంటూ కొనియాడారు. అంతేకాకుండా రాజ్యాంగం ఎంతమంచిదైనప్పటికీ పాలించేవారు మంచివారు కాకపోత చివరికి రాజ్యాంగం కూడా తప్పుగా…