సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) వచ్చే ఆరు నెలల్లో పిల్లల కోసం కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో అదార్ పూనావాలా మంగళవారం తెలిపారు. పరిశ్రమ సదస్సులో పాల్గొన్న పూనావాలా మాట్లాడుతూ.. ‘కోవోవాక్స్’ వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉందని, మూడేళ్ల వరకు పిల్లలకు రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కోవిషీల్డ్, ఇతర కోవిడ్ వ్యాక్సిన్లు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఆమోదించబడ్డాయని ఆయన అన్నారు. “మేము పిల్లలలో…
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర తుదిదశకు చేరుకుంది. గత నెల1న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు 44వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ రాజధాని రైతులు 45 రోజుల మహాపాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు అలిపిరి పాదాల వద్దకు రాజధాని రైతుల పాదయాత్ర చేరుకుంది. అయితే రేపు తిరుమల శ్రీవారిని రాజధాని రైతులు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి రాజధాని రైతులకు టీటీడీ అధికారులు…
గడ్డి అన్నారంలో గల మార్కెట్‌ను తరలించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మార్కెట్‌ను తరలించవద్దని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. అలాగే బాటసింగారం వెళ్లేందుకు వ్యాపారులకు హైకోర్టు నెల గడువు ఇచ్చింది. నెల రోజుల్లో ప్రభుత్వం బాటసింగారంలో…
ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తొర్రూర్ మండలం గుర్తుర్ గ్రామ శివారులోని ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నర్సంపేట నుండి తొర్రూర్ కు ఆర్టీసీ బస్సు వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడంలో…
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ రోజుకో రాష్ట్రంలో వెలుగు చూస్తోంది. ఇటీవల తెలంగాణాకు పక్కనే ఉన్న ఏపీలోనూ రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్‌పై అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనే ప్రణాళికలపై…
తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల గణనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీల కులగణన చేస్తామని, బీసీల పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక బీజేపీ బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీసీల లెక్కలను తీయడంలో…
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. డిసెంబర్ 13న రెజీనా పుట్టిన రోజు కావడంతో యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రా ఎంటర్టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా అధినేతలు మాట్లాడుతూ, ”సోషల్ సెటైరికల్‌గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజకీయ నేతల్లో మాటల యుద్ధం నడుస్తోంది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో పవన్ వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించి వైసీప ఎమ్మెల్య అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర చేతుల్లో ఉందని ఈ నేపథ్యంలో పవన్ బీజేపీ ప్రభుత్వం పోరాటం చేయాలని సూచించారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడులా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉచిత రిజిస్ట్రేషన్లు కోరుతూ ఈ నెల 20, 23న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కక్ష సాధింపు కోసమే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రేమచంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో చెల్లింపులు జరిగాయని ఆయన అన్నారు. ఏపీలో రైతులు ఆందోళన చెందుతున్నారని రైతుల…
అక్రమ విల్లాలపై హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. దుడింగల్ మల్లంపేటలో అక్రమ విల్లాలపై ప్రభుత్వం సీరియస్ అవడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెలాఖరులోగా అక్రమ విల్లాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మల్లంపేటలోని లక్ష్మీశ్రీనివాస్ పేరుతో 65 విల్లాలకే హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చింది. అయితే 260 విల్లాలకు అనుమతి ఉందంటూ లక్ష్మీశ్రీనివాస్ సంస్థ నకిలీ పత్రాలు సృష్టించింది. అంతేకాకుండా 325 విల్లాలు…