గత బుధవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికతో సహా 13 మంది తమిళనాడులోని కూనూర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సంగతి తెలిసిందే. అయితే నిన్న బిపిన్ రావత్, మధులిక ల అంత్యక్రియలు జరిగాయి. అయితే వీరితో పాటు ప్రమాదంలో మృతి చెందిన సైనికుల మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు వారి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏలను సేకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నలుగురి మృతదేహాలు గుర్తించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రపదేశ్ కు చెందిన బి.సాయితేజ లాన్స్ నాయక్‌గా బిపిన్ రావత్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ప్రమాదంలో సాయితేజ కూడా మరణించాడు. అతడి మృతదేహాన్ని కూడా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించామని విమానంలో సాయితేజ మృతదేహాన్ని తన స్వగ్రామానికి చేర్చుతున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే సాయితేజ స్వగ్రామంలో కూడా అధికారులు అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నంలోపు సాయితేజ మృతదేమం ఇంటికి చేరితే సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు.. సాయంత్రం వరకు మృతదేహం ఇంటికి చేరుకుంటే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.