మహానగరంలో మాయగాళ్లకు కొదవేలేదు అంటుంటారు. ఎందుకంటే.. రోజురోజుకు భాగ్యనగరంలో కొత్తకొత్త రూపాల్లో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి. అందులో అక్రమ నిర్మాణాలు కూడా ఒకటి. అయితే హైదరాబాద్‌లో నకిలీ ధృవప్రతాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాల పై కొరడా ఝుళిపించేందుకు అధికార యంత్రాగాన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30 లోపు అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయాలని హెచ్ఎండీఏ పరిధిలోని మునిసిపల్ కమిషనర్…
టీఆర్ఎస్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే టీఆర్ఎస్ నేతలు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయం స్థానిక నేతలకు తెలిసినా వారి మధ్య సంది కుదిర్చేందుకు సహాసించలేదు. అయితే నేడు సబితా ఇంద్రారెడ్డి ముందే ఇరు వర్గాల నేతల…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెంది దాని ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాకుండా ఇటీవల భారత్‌లోకి కూడా ఈ డేంజరస్ వైరస్ ప్రవేశించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) డేటా ప్రకారం.. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 మధ్య, కోవిడ్ ఇన్ఫెక్షన్లలో 34.9 శాతం 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలే ఉన్నారని…
గత రెండు సంవత్సరాలు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ పలు దేశాలకు వ్యాప్తి చెందడంతో విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారికి కరోనా పరీక్షలు మరింత ముమ్మరంగా వైద్యులు చేస్తున్నారు. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కావలికి…
కరోనా మహమ్మారి రోజురోజు కొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు, దాని నివారణకై శాస్త్రవేత్తలు ఇప్పటికే తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ఆరోగ్య అధికారులు బుధవారం…
ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ వైద్యసేవలను విస్తృతం చేయడంలో భాగంగా కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన మూడో అంతస్తును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ , ఆర్ఈఐటీ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)ల చొరవతో 100 పడకల సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్‌ను…
ముషీరాబాద్ రిసాలగడ్డ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బందికి మృతదేహం కనిపించడంతో పోలీసులుకు, అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించి మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ నుంచి బయటకు తీశారు. అయితే 50 అడుగుల ఎత్తున్న వాటర్ ట్యాంక్‌కు రెండు ద్వారాలు ఉన్నాయని.. ఆ రెండూ మూసే ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ పైన ఓ చెప్పుల జత కనిపించడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు…
జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో మంగళవారం మధ్యాహ్నం ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. పొలంలో కాలిపోయిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడంతో అర్థరాత్రి ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ (54) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలంలో వరి చెత్తకు నిప్పంటించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కంటిచూపు సమస్య ఉన్న లక్ష్మణ్ గౌడ్ మంటలను గమనించలేకపోయాడు. అతడిని రక్షించేందుకు చుట్టుపక్కల…
మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవడం మామూలే. అయితే తాజాగా మరో కూలీని అదృష్టం వరించింది. దీంతో ఆ కూలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గిరిజన కూలీ అయిన ములాయం సింగ్‌కు జీవితం రోజువారీ పోరాటం. తన పిల్లలను చదివించుకోవటం, ఇళ్లు గడపడం చాలా కష్టంగా మారింది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పన్నా వజ్రాల గనుల్లోని నిస్సార…