టీనేజ్ లోనే యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసండ్ర. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ మీదుగా వెండితెరపైకి వచ్చింది. హీరోగా సుధీర్ బాబు, హీరోయిన్ గా రెజీనా ఇద్దరూ 2012లో ‘ఎస్.ఎం.ఎస్.’ మూవీతోనే తెలుగువారి ముందుకొచ్చారు. ఫస్ట్ మూవీతోనే నటిగా గుర్తింపు పొందిన రెజీనాకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రా.. రా…. కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం,…
ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా మహమ్మారి రూపాంతరాలు చెంది మరోసారి ప్రజలను భయపెడుతోంది. ఇప్పడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న వేళ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికీ ఈ వేరియంట్ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతుండగా ఇటీవల భారత్‌లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ రోజు కొత్తగా ఏపీలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు…
ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తబ్లిగీ జమాత్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ వారిపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇస్లామిక్ మతాన్ని కాపాడటమే ధ్యేయమంటూ వ్యాఖ్యలు చేసే ఈ సంస్థపై సౌదీ అరేబియా నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1926లో తబ్లిగీ జమాత్ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో సుమారు 35 కోట్ల ముస్లింలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముస్లింలకు చెందిన సంస్థను…
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంప ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వేరియంట్ బయటపడ్డ 15 రోజుల్లోనే 66 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. రోజురోజుకు చాపకింద నీరులా ఒక్కొక్క రాష్ట్రంపై ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతోంది. అయితే…
కృష్ణ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జి.కొండూరు మండలం వెలగలేరులోని ప్రభుత్వ మద్యం దుకాణ వాచ్మెన్ సాంబయ్యను గుర్తు తెలియని దుండగలు గత రాత్రి హత్య చేశారు. అంతేకాకుండా హత్య అనంతరం మద్యం బాటిళ్లతో పరారయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండ నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మద్యానికి బానిసైన వారే ఈ హత్యకు పాల్పడిఉంటారని పోలీసులు…
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL), తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSREDCO) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషిస్తున్నాయి. సబ్ స్టేషన్లలో తగినంత స్థలం ఉన్నందున, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఆర్‌ఈడీసీవోలు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పడ్డాయి. ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా సిద్ధం కానప్పటికీ, ఈ-వాహన యజమానుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అధికారులు దీనిని…
ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో పాటు లాన్స్ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్న సాయితేజ కూడా మరణించిన విషయం తెలిసిందే. అయితే నిన్న బెంగళూరుకు చేరుకున్న సాయితేజ పార్థీవదేహం ఈ రోజు ఎగువరేగడుకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం సాయితేజ మృతదేహం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం సాయితేజ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయితేజ అంత్యక్రియలు వీక్షించేందుకు ఈ క్రింద ఉన్న వీడియో చూడండి.
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం పనుల్లో అవినీతి జరిగిందన్నారని.. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్‌లో ఏం సాధించారు..? అని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. చిత్తశుద్ది ఉంటే వైసీపీ ఎంపీలు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.