హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. లోధా అపార్ట్మెంట్స్ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు.…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ఇలా విమానాశ్రయానికి చేరుకుంటున్న విద్యార్థులకు వారి ఊర్లకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల…
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. కాళేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు, ఆలయంలో స్వామి వారికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు…
క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను జమచేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజుకు రూ.10ల వడ్డీకూడా చెల్లించాల్సిన పరిస్థితులు చిరువ్యాపారులకు ఉండేవని, ఇవాళ రూ.510.46 కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్నామన్నారు. మొత్తంగా ఇవాళ రూ.526.62 కోట్లను ఇస్తున్నామని, గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తీసుకున్న…
ఏపీలో జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఖాతాల్లో రుణాలను సీఎం జగన్ జమచేమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న తోడు మూడో విడత కింద 5,10,462 మందికి మంచి చేస్తూ రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని ఆయన అన్నారు. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, వీరితో కలుపుకుంటే 14.16 లక్షల మందికి మేలు చేయగలిగామని ఆయన వెల్లడించారు. నామమాత్రపు…
పోలియో చుక్కల పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో మొదటి రోజు ఐదుసంవత్సరాల్లోపు చిన్నారులందరికీ ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు, పంచాయతీ కార్యాలయాలతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తల్లిదండ్రులు చుక్కలు వేయించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక సెంటర్లను నెలకొల్పారు. పోలియో సమూల నిర్మూలనకు చేపట్టిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి…
సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు. అమాయకులైన ప్రజలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. మరోవైపు మరి కొందరు.. రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వివాదస్పద పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా నిన్న హ్యాక్‌కు గురైంది. ఆయన ఖాతాను తమ అధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు క్రిప్టో కరెన్సీ ద్వారా…
టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీమంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు యడ్లపాటి వెంకట్రావు (102) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి యడ్లపాటి వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన యడ్లపాటి.. వేమూరి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి వెంకట్రావు.. 1995లో గుంటూరు జడ్పీచైర్మన్‌గా…
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ పునఃప్రారంభమైనప్పటి నుండి దాదాపు 40,000 మంది ఈ స్థలాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. సాధారణంగా జనవరిలో నిర్వహించే ఈవెంట్ ఓమిక్రాన్ కారణంగా కోవిడ్ కేసుల వేగవంతమైన పెరుగుదల దృష్ట్యా గత నెలలో నిలిపివేయబడింది. అంతేకాకుండా గత సంవత్సరం, కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా సొసైటీ దీనిని నిర్వహించనందున నగరం నుమాయిష్‌కు మిస్ అయ్యింది. అయితే శుక్రవారం తిరిగి ప్రారంభమైనప్పటి నుండి, ఎగ్జిబిషన్ గ్రౌండ్ మెగా వార్షిక ఫెయిర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుటుంబాలతో…
గత వారం కర్మన్‌ఘాట్‌లో మత కలహాల సందర్భంగా పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు ఆరుగురిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో గౌలిపురానికి చెందిన వ్యాపారి శివ చంద్ర గిరి (35), మీర్‌పేటకు చెందిన వ్యాపారి వర్ప లలిత్ చౌదరి (22), డిగ్రీ విద్యార్థి గొడవల శృతిక్ రెడ్డి (19), డిగ్రీ చదివిన మేడి అంకిత్ (20) ఉన్నారు. విద్యార్థి, అల్మాస్గూడ నివాసి, మేనేజ్మెంట్ కోర్సును అభ్యసిస్తున్న పి రాజ్ స్వీకృత్ రెడ్డి (19) బాలాపూర్‌లో…