టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీమంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు యడ్లపాటి వెంకట్రావు (102) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి యడ్లపాటి వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన యడ్లపాటి.. వేమూరి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి వెంకట్రావు.. 1995లో గుంటూరు జడ్పీచైర్మన్‌గా పని చేశారు.
అంతేకాకుండా 1998లో రాజ్యసభ సభ్యుడిగా యడ్లపాటి వెంకట్రావు ఎన్నికయ్యారు. 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు వెంకట్రావు దూరంగా ఉన్నారు. అయితే గత సంవత్సరం వెంకట్రావు సతీమణి అలివేలు మంగమ్మ మృతి చెందారు. అయితే యడ్లపాటి మృతిపై టీడీపీ నేతలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.