యుద్ధ భూమి నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు అంగీకరించారు. రెండో విడత చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు మధ్య బెలారస్లో చర్చలు జరిగాయి. ఈ యుద్దంలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయానికి ఇరుదేశాలు అంగీకరించాయి. పోలిష్-బెలారసియన్ సరిహద్దుల్లో బ్రెస్ట్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం జరిగింది. అయితే ఈ చర్చలు ఆలస్యం అయ్యే కొద్దీ మా డిమాండ్ల…
తుకారాం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి (RuB) రూ. 29.10 కోట్లతో శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నాలుగు దిశలలో అభివృద్ధి చెందుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ కదలికలను క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని నిర్ధారించడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేస్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డిపి) కింద ఈ ప్రయత్నాలలో భాగంగా తుకారాం గేట్ రూబిని నిర్మించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), రైల్వేశాఖ నిధులతో అండర్ బ్రిడ్జితోపాటు అప్రోచ్ రోడ్డు…
గత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7 నుంచి మొదలు కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న విషయంపై టీడీపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటికే గురువారం మధ్యాహ్నం…
రాజశేఖర్ రెడ్డి కుటుంబం కంటే టీడీపీ హయాంలో ఎక్కువ అభివృద్జి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పకుంటానని వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమరనాథ్ అన్నారు. చంద్రబాబు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు అస్యహించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అమరావతి ప్రజల రాజధాని కాదు పెట్టుబడిదారుల రాజధాని అని, ఉత్తరాంధ్ర రాయలసీమ మీద చంద్రబాబు విషం చిమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపార అని, ఉత్తరాంధ్రకు వచ్చి చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు…
ఉక్రెయిన్‌లో ఇరవై వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది వైద్య విద్యార్ధులు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో వారిని కేంద్ర ప్రభుత్వం క్షేమంగా స్వదేశం రప్పించింది. ఐతే, కర్ణాటకకు చెందిన మెడికల్ స్టూడెండ్ నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ తాజా ఘర్షణలకు బలయ్యాడు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో నవీన్ చదువుతున్నాడు. ఈ ఘటన తరువాత ఉక్రెయిన్ వైద్య విద్య అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్‌లో మెడిసిన్ సీటు రాని వారు విదేశీ యూనివర్సిటీల…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభానికి సిద్ధమైయ్యాయి. ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 5.18 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి, సౌకర్యాలు కల్పించామని తెలిపారు.…
మహారాష్ట్రలోని ఆన్లైన్ పబ్జీ గేమ్ ఆడిన తర్వాత జరిగిన వివాదంలో తమ స్నేహితుడిని చంపినందుకు పోలీసులు మంగళవారం 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని వర్తక్ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు స్నేహితులు తరచూ పబ్జీ గేమ్ ఆడుతూ, ఆ తర్వాత ఏదో ఒక సమస్యపై గొడవ పడుతుండేవారని వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సదాశివ నికమ్ తెలిపారు. సోమవారం…
రోజురోజుకు మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టుల తమ ఉనికి కాపాడుకోవడానికి నిత్యం దాడులు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్‌లో నిన్న రాత్రి నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. అర్ధరాత్రి పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోత్కపల్లి క్యాంపుపై ఒక్కసారిగా మావోలు దాడి దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. జవాన్ల కాల్పులలో పలువురు మావోయిస్టులు…
అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోందని, విజయపథంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వెల్లడించారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు. దేశంలోనే అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి అని కేటీఆర్ హర్షం…
దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధి రేటును (9.2%) నమోదు చేసింది, ఇది 1,896 kwh (2018-19) నుండి 2,071 kwh (2019-20)కి పెరిగిందని తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలిపింది. పెరుగుతున్న విద్యుత్ వినియోగం అధిక అభివృద్ధి మరియు మానవ సంక్షేమ సూచికలతో పరస్పర సంబంధం కలిగి ఉంది. రాష్ట్రంలో 1.65 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 72.8 శాతం గృహ కనెక్షన్లు, 15.4 శాతం వ్యవసాయ, 11.6 శాతం పారిశ్రామిక…