అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనధికార లేఅవుట్ల ప్లాట్లను షరతులతో రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 5 వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వేల సంఖ్యలో పిటిషన్లు వస్తున్నందున హై కోర్టలు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో కూడిన రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని యుద్ధ పరిస్థితులతో అక్కడ చిక్కుకునన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ ఎంబీసీతో పాటు.. సంబంధింత అధికారులతో మాట్లాడుతూ.. భారతపౌరులను దేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎంబసీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతపౌరులు ఉక్రెయిన్ సరిహద్దు దాటి పోలెండ్ కు చేరుకుంటే అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలెండ్ రాజధాని భారత రాయబార కార్యాలయం భారత్ పౌరులు, విద్యార్థులకు…
ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రంలో అత్యవసరంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితర ఉన్నతాధికారులు ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు వహిస్తారని ఆయన తెలిపారు. 1902 నెంబర్ ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో విద్యార్ధులు మినహా ఇతర ప్రవాసాంధ్రులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద లేదని ఆయన వెల్లడించారు. ఆ వివరాలను…
విద్యుత్ పంపిణీ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలను చర్చకు తావు లేకుండా ఈఆర్సీ తిరస్కరించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడతూ.. రాష్ట్ర విభజన తర్వాత డిస్కామ్‌ల, ట్రాన్స్క్ లలో ఈఆర్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు 11 వేల కోట్లు ఉంటే.. 8 వేల 9 వందల కోట్ల అప్పు భారం ను కేంద్రం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఉదయ్ స్కీమ్‌లో…
జాతీయ స్థాయిలో టెక్నాలజీ, వినియోగంలో తాజాగా మరో 15 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ దక్కించుకుంది. టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డు లను ఏపీ పోలీస్ శాఖ గెలుచుకుంది. టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచిందని…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులను యావత్తు ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై వార్ డిక్లర్ చేయకనే చేశారు. అయితే దీనిపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోరాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఉక్రెయిన్ వ్యవహారంలో తలదూర్చితే ఎక్కడివరకైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ సంకేతాలు పంపారు. అయితే ఎప్పటినుంచో అగ్రరాజ్యం అమెరికా, రష్యాలకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమెరికా ఎలాంటి…
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ గ్రామానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెళ్లారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న బద్ధం నిహారిక కుటుంబ సభ్యులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఉక్రెయిన్ లో ఉన్న బద్దం నిహారిక తో వీడియో కాల్ లో మాట్లాడి అక్కడి పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. రష్యా దాడులతో నిన్న రాత్రి నుండి భయం భయంగా గడుపుతున్నామని నిహారిక వాపోయారు. తాను ఉన్న దగ్గర పరిస్థితి కొంత…
ఐక్కా(IKEA) స్వీడిష్ గృహోపకరణాల రిటైలర్, సుసానే పుల్వెరర్‌ను తన భారతదేశ వ్యాపారం కోసం దాని కొత్త మరియు మొదటి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ (CSO)గా నియమించింది. సుసానే అవుట్గోయింగ్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఐక్కా ఇండియాలోని సుసానే పుల్వెరర్ ఇంగ్కా గ్రూప్‌లో ఇంతకుముందు గ్రూప్ బిజినెస్ రిస్క్ మరియు కంప్లయన్స్ మేనేజర్‌గా పనిచేశారు. సుసానే 1997లో ఐక్కాలో చేరారు. ఐక్కాలో సుసానే విభిన్న…
ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. ఉక్రెయిన్‌లో నెలకొన్ని గందరగోళ పరిస్థితుల్లో అక్కడి చిక్కకున్న భారత పౌరులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు సమీపిస్తున్నాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా యోచినలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని భారత్ భావిస్తోందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌లో…
ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటు కొత్తవి కలిపి 215 కంపెనీల నుంచి లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.6,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ విజయం సాధించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనివల్ల అదనంగా 34,000 మందికి ఉపాధి లభించిందని, గత ఏడాదితో పోల్చితే 100 శాతం పెట్టుబడి ఎక్కువైందని ఆయన వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వార్షిక ఫ్లాగ్షిప్ ఈవెంట్ అయిన బయోఏషియా 19వ ఎడిషన్‌ను ప్రారంభిస్తూ, కోవిడ్ ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి…