తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలంటూ గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యోగం పోయేవరకు కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం లోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయించే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ని…
సీఎం కేసీఆర్ ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన టీఎస్ బీపాస్ గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఎస్ బీపాస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కోసం పట్టణాలు, పంచాయితీలు, స్ధానిక సంస్థల పరిధిలో జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనన, మరణాలను వందశాతం నమోదు…
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యక్తిగత విమర్శలు మానుకో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎంపీ రంజిత్ రెడ్డి హెచ్చరించారు. చాతనైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పార్లమెంట్లో మాతో పాటు కొట్లాడు అని ఆయన అన్నారు. వరి కొనుగోలు కోసం కేంద్రంతో…
ఎంతో మంది కళాకారులు నైపుణ్యంతో వస్తువులు తయారు చేస్తున్నారని, కళాకారులకు ప్రోత్సాహం అవసరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు హస్త కళలను ప్రోత్సహించాలని, మార్చి 6వ తేదీ వరకు హునర్ హాట్ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. ఏ దేశానికి మనం తక్కువ కాదు, గొప్ప వారసత్వం మనదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా విదేశాలకు వెళ్ళినప్పుడు…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎంతో మంది రైతులు పేర్లు మారిపోవడం.. గుంట స్థలం ఉన్నవారికి ఎకరా స్థలంగా నమోదైతే.. ఇక ఎకరాల భూమి ఉన్న రైతు గుంట స్థలానికి యజమానికిగా చూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్…
మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సాయిబాబానగర్లో ఏటీఎం నగదుతో ఉడాయించిన డ్రైవర్ సాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నగరాలు తిరిగిన అనంతరం నగరంలో జేబీఎస్ బస్టాండ్లో డ్రైవర్ సాగర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీన రైటర్స్ సంస్థ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపటానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ సాగర్ 36 లక్షలతో పరారయ్యాడు. వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి నగదుతో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. వివిధ బస్సులు మారుతూ…
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయిన ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలే బిజినెస్ మన్ లు వైద్యులు, ఇప్పుడు తాజాగా ఐ టి ఎంప్లాయిస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ కేసులో ఎవరి ప్రమేయం ఉన ఎంతటి వారినైనా వదిలేది లేదని నగర పోలీస్ బాస్ హెచ్చరించారు నార్కోటిక్స్…
బాలీవుడ్ లో కంగనా రనౌత్ విమర్శల నుంచి తప్పించుకున్న వారు బహు అరుదు. ఇక వారసులను అయితే కంగనా ఓ ఆట ఆడుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నో మార్లు ఆలియా భట్ పై విమర్శల జల్లు కరిపించింది. ఆలియాను వారి కుటుంబసభ్యులతో కలపి ‘బాలీవుడ్ మాఫియా గ్యాంగ్’ అనేసింది కూడా. ఇక ఆలియా నటించిన ‘గంగూబాయి’ సినిమా రిలీజ్కు ముందు 200 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా ఖర్చు అంతా బూడిదలో పోసిన…
ఈ రోజు తాజ్ డెక్కన్ లో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఐఈ (ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ) సంస్థ అందిస్తున్న “ఛాంపియన్స్ ఆఫ్ ది ఛేంజ్” అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. అయితే.. అధికారిక కార్యక్రమాల వల్ల అవార్డు స్వీకరణకు సంతోష్ కుమార్ అందుబాటులో లేని కారణంగా.. ఆయనకు బదులుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ కే.జీ బాలకృష్ణన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. అవార్డు వేడుకకు…