ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు. అయితే ముందుగా ఈ నెల 4న ఉదయం 11 గంటలకే ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పదో తరగతి ఫలితాలను విడుదల చేయడం వీలు కాలేదు.…
మరోసారి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పాపం జగనుదేనని, పోలవరం విషయంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 2021 జూన్ కల్లా పోలవరం పనులు పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పేశారని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదని, పోలవరానికి సంబంధించి కేంద్రం నిధులేమయ్యాయో జగన్ ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యక్తి వెదిరె…
ఏపీలో రేపు, ఎల్లుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నడ్డా పర్యటన ఏపీలో కచ్చితమైన మార్పుకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రోడ్ మ్యాప్‌ను ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతారని, 2024 ఎన్నికలకు దశాదిశా నిర్దేశం ఇస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు సన్నద్దం అయ్యేలా క్యాడర్‌ను సిద్ధం చేస్తారని, నడ్డా ఏపీ కార్యక్రమం ఖరారు కాగానే జగన్…
నేడు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనలో రాష్ట్రంలో పర్యావరణానికి అపార నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కొండలను కొట్టేస్తూ.. ఇసుకను దోచేస్తూ.. జల వనరులను మింగేస్తూ, గనులను కబళిస్తూ పర్యావరణ వినాశనానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలిగిస్తోన్న ఈ ప్రభుత్వ పెద్దలపై ప్రజలు రణం చేయాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. సహజ వనరుల దోపిడితో ప్రకృతికి ఈ…
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రూ. 1.35 కోట్లతో అదనపు తరగతులు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎక్కడా లేని విధంగా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. మూడు విడుతల్లో అభివృద్ధి చేస్తున్నారని, వారం రోజులు పాఠశాలల్లో భోజనాలు ఏం పెట్టాలో కూడా సీఎం గారు నిర్ణయించారని…
ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారనే అభియోగంతో టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు నిన్న సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. గౌతు శిరీష కుటుంబాన్ని అణచివేయటానికి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ర్టంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తుందని, ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని ప్రయత్నిస్తే అరెస్ట్ చేయాలఇ భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, బీసీ…
అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు పడింది. సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోలీస్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినందుకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నవీన్ కుమార్ శెట్టిని అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిసాలి సస్పెండ్ చేశారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ లో అమ్మోనియా విషవాయువు ల ప్రభావంతో అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించిన పోస్టు చివరిలో అన్న వచ్చాడు….అస్వస్థత తెచ్చాడు అంటూ క్యాప్షన్…
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాతో నిరాధరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ నేతల సోషల్ మీడియా ఖాతాలను ఫోర్జరీ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అధికార వైసీపీ మద్దతుదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశంతో రెండు రాజకీయ వర్గాల మధ్య…
తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. చైన్నైలోని తిరునల్వేలి పనకుడి పట్టణంలో ఓ ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ కారులోకి ఎక్కారు. అయితే వారికి తెలియక కారు డోర్ లాక్ చేశారు. అయితే పిల్లలు ఆడుకుంటున్నారని దగ్గరలోనే ఉన్న గుడిలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లారు నాగరాజన్ కుటుంబ సభ్యులు.. గుడికి వెళ్లొచ్చిన నాగరాజన్ కుటుంబ సభ్యులు పిల్లల గురించి చూశారు. అయితే ఎంత వెతికిన ఇంట్లో కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లోని కారులో చూడగా.. ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు.…
గత కొన్నేళ్ళుగా సహజీవనం చేస్తున్న కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. విచిత్రం ఏమంటే… ఇప్పటికే వారికి వివాహం జరిగినట్టుగా కొన్ని వందలసార్లు వార్తలు వచ్చాయి. కలిసి జీవితాన్ని గడుపుతున్న వీరు మాత్రం ఈ విషయమై పెదవి విప్పలేదు. ఇదిలా ఉంటే… తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను శనివారం కలిసి తమ వివాహ శుభలేఖను వారు అందించారు. ఈ సందర్భంగానూ వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తెలిసిన…