Home
Breaking News
Breaking News News
-
RBI : వడ్డీ రేట్లు మళ్లీ పెంచే యోచనలో ఆర్బీఐ
దేశంలో నిత్యావసరాల నుంచి మొదలు అన్నిటి ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లుగా తయారైంది ప్రజల పరిస్థితి. అయితే.. ఇప్పుడు మరో పెనుభారం సామాన్యుడి నడ్డి విరువనుంది. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో సామాన్యులకు రుణాలు భారంగా మారాయి. మళ్లీ వడ్డీ రేట్లు పెంచితే మధ్య తరగతి జీవులకు గృహ, వ్యక్తిగత తదితర రుణాలు… -
JP Nadda AP Tour : నేడు, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన
నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. అయితే.. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తికేంద్రాలుగా మార్చింది. వాటికి ఇంఛార్జీలను నియమించింది. ఆయా శక్తి కేంద్రాల ఇంఛార్జీలతో విజయవాడలో… -
AP SSC Results 2022 : విద్యార్థులు సిద్ధకండి.. నేడే ఫలితాలు విడుదల
ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు. అయితే ముందుగా ఈ నెల 4న ఉదయం 11 గంటలకే ఫలితాలను విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల పదో తరగతి ఫలితాలను విడుదల చేయడం వీలు కాలేదు.… -
Devineni Uma : ఆ విషయంలో జగన్ జైలు కెళ్లడం ఖాయం
మరోసారి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పాపం జగనుదేనని, పోలవరం విషయంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 2021 జూన్ కల్లా పోలవరం పనులు పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పేశారని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదని, పోలవరానికి సంబంధించి కేంద్రం నిధులేమయ్యాయో జగన్ ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యక్తి వెదిరె… -
BJP Vishnuvardhan Reddy : ఏపీలో బీజేపీపై జగన్ చేస్తున్న కుట్ర ఇది
ఏపీలో రేపు, ఎల్లుండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నడ్డా పర్యటన ఏపీలో కచ్చితమైన మార్పుకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీజేపీ రోడ్ మ్యాప్‌ను ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతారని, 2024 ఎన్నికలకు దశాదిశా నిర్దేశం ఇస్తారని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు సన్నద్దం అయ్యేలా క్యాడర్‌ను సిద్ధం చేస్తారని, నడ్డా ఏపీ కార్యక్రమం ఖరారు కాగానే జగన్… -
Chandrababu : విధ్వంస పాలనలో పర్యావరణానికి అపార నష్టం
నేడు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనలో రాష్ట్రంలో పర్యావరణానికి అపార నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కొండలను కొట్టేస్తూ.. ఇసుకను దోచేస్తూ.. జల వనరులను మింగేస్తూ, గనులను కబళిస్తూ పర్యావరణ వినాశనానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలిగిస్తోన్న ఈ ప్రభుత్వ పెద్దలపై ప్రజలు రణం చేయాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. సహజ వనరుల దోపిడితో ప్రకృతికి ఈ… -
Peddireddy Ramachandra Reddy : జగన్ ఎక్కడా లేని విధంగా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారు
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రూ. 1.35 కోట్లతో అదనపు తరగతులు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎక్కడా లేని విధంగా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. మూడు విడుతల్లో అభివృద్ధి చేస్తున్నారని, వారం రోజులు పాఠశాలల్లో భోజనాలు ఏం పెట్టాలో కూడా సీఎం గారు నిర్ణయించారని… -
MP Ram Mohan Naidu : గౌతు శిరీష కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు
ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారనే అభియోగంతో టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు నిన్న సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. గౌతు శిరీష కుటుంబాన్ని అణచివేయటానికి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ర్టంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తుందని, ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని ప్రయత్నిస్తే అరెస్ట్ చేయాలఇ భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, బీసీ… -
Constable Suspend : సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ సస్పెండ్..
అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు పడింది. సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోలీస్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినందుకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నవీన్ కుమార్ శెట్టిని అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిసాలి సస్పెండ్ చేశారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ లో అమ్మోనియా విషవాయువు ల ప్రభావంతో అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించిన పోస్టు చివరిలో అన్న వచ్చాడు….అస్వస్థత తెచ్చాడు అంటూ క్యాప్షన్… -
Varla Ramaiah : సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు వర్ల రామయ్య లేఖ
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాతో నిరాధరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ నేతల సోషల్ మీడియా ఖాతాలను ఫోర్జరీ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అధికార వైసీపీ మద్దతుదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశంతో రెండు రాజకీయ వర్గాల మధ్య…
తాజావార్తలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!