డ్రైవర్ బాధ్యత చాలా గొప్పది.. ఎందుకంటే.. తాను నడిపే వాహనంలో ఉన్న ప్రాణాలు డ్రైవర్ చేతిలోనే ఉంటాయి. డ్రైవర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రమాదాల్లో ఎంతో మంది మృత్యువాత పడ్డ సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు అనుకోని ప్రమాదం జరిగితే.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రయాణికుల ప్రాణాలు కాపాడేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే యాంగ్…
నైరుతి రుతుపవనాలు కేరళను మూడు రోజుల ముందుగానే తాకాయి. అయితే రుతుపవనాల విస్తరణ మాత్రం నెమ్మదిగా జరుగుతోంది. అయితే తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం వెల్లడించారు. జూన్ 6 నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న ఆయన.. హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం…
కరోనా వైరస్‌తోనే కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ విరుచుకుపడుతోంది. అయితే.. ఈ వైరస్ చిన్నారులను టార్గెట్ చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. రోజు రోజుకు మంకీ పాక్స్ కేసులు దేశాలకు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ 27 దేశాలకు విస్తరించింది. 27 దేశాల్లో మొత్తం 780 మంకీపాక్స్ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 257 కేసులు బయటపడగా… ఈ…
హైదారాబాద్‌లో వరుస అత్యాచార ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కార్ఖానలో వెలుగు చూసిన మైనర్ బాలిక అత్యాచార ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిని యువకులు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఐదుగురు యువకుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయితో స్నేహంగా ఉంటూనే యువకులు లైంగిక వాంఛ తీర్చుకున్నారు. మైనర్ బాలికపై రెండు లాడ్జిలలో లైంగిక దాడికి జరిగిందని పోలీసులు గుర్తించారు. అయితే.. ఇద్దరు మైనర్లు, ముగ్గురు మేజర్లతో పాటు ఇద్దరు…
కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని భయాందోళనుకు గురి చేసిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరో సారి కోరలు చాస్తోంది. రోజురోజుకు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 25 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ రోజువారీ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు…
అవిశ్వాస తీర్మానంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సత్తా చాటారు. పార్టీ గేట్ వ్యవహారంపై బోరిస్ జాన్సన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బోరిస్‌పై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిగా.. తీర్మానానికి మద్దతుగా 148 మంది సభ్యులు ఓటు వేయగా.. బోరిస్‌కు మద్దతుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 211 సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. 59 శాతం మంది సభ్యులు తనకు మద్దతుగా నిలవడం…
హైదరాబాద్‌లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అమ్నీషియా పబ్ రేప్ కేసు మరవకముందే రెండు రోజుల వ్యవధిలో రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయిని సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానాకు చెందిన ఓ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్, రితేష్ అనే ఇద్దరు యువకులు…
అమ్నీసియా పబ్ అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో నిందుతులపై త్వరగా పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిందితులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మీడియాకు చూపారు. అయితే ఈ ఘటనలో మైనర్లు ఉన్నారని.. వారికి సంబంధించిన ఫోటోలో, వీడియోలు ఎలా చూపిస్తారంటూ రఘునందన్ రావుపై విమర్శలు గుప్పుమన్నాయి. దీనిపై స్పందించిన రఘునందన్ నేను ఎవరీ పేరును ప్రస్తావించలేదని, ఎవరి…
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఓ వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన పొత్తుల నుంచి సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పేరు ప్రకటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికలకు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ పోటీ చేయడం లేదు. కానీ.. బీజేపీ పోటీకి సిద్ధమైంది. అయితే నెల్లూరు జిల్లాలో తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఘన విజయం…
నేడు ఏపీలో బీజేపీ జాతీయ అధ్యుడు జేపీ నడ్డా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోడీ పొలిటికల్ కల్చర్ మార్చారని, దేశంలో మరే ఇతర జాతీయ పార్టీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత బీజేపీ పోరాటం కుటుంబ పార్టీలతోనేనని, బాప్-బేటా పార్టీలతోనే చాలా రాష్ట్రాల్లో పోరాడుతున్నామని ఆయన వెల్లడించారు. ఏపీలోనూ వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలే.. వాళ్లతోనే మన పోరాటమని, తెలంగాణలోనూ…