అన్ని యాత్రలలో చార్ ధాయ్ యాత్ర ప్రత్యేకమైనది. అయితే ఈ సంవత్సరం ప్రారంభ నుంచే చార్ ధామ్ యాత్ర వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర మే 3న ప్రారంభించారు అధికారు. అయితే.. చార్ ధామ్ యాత్రకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు. 2019లో 7 నెలల పాటు…
ఏపీలో పరిస్థితులు రోజురోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అత్యాచార ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో ఇటు ప్రభుత్వం, అటు పోలీసు శాఖ మృగాళ్లను కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. పాఠశాలలకు పంపితే పాఠశాలలోని ఉపాధ్యాయులే విద్యార్థినులపై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం శోచనీయం. అయితే తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి…
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లోని బెకాన్ గంజ్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకున్న హింసాకాండ వెనుక ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) హస్తం ఉండొచ్చని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి 800 మందికి పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిలో 24 మందిని అరెస్ట్ చేసి, 12 మందిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో రికార్డింగ్‌ల ఆధారంగా హింసకు పాల్పడిన 36 మందిని…
జగన్ అసమర్ధ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో సారి సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు వాయిదాలకు అలవాటు పడి పడి.. పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తే ఎలా జగన్..? అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి బొత్సకు తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య తెలుసా..? అంటూ ఆయన విమర్శించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల వాయిదాపై విద్యార్దులకు సమాధానం…
మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఆయన నేడు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ బీజేపీ పోరాటం చేస్తోందని, సిద్ధాంతమని చెప్పుకొనే డీఎంకే పార్టీల కూడా కాంగ్రెస్‌తో పాటు కుటుంబ పార్టీ గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, అందుకే పోటీ చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయం పేరుతో వైసీపీ దగా చేస్తోందని, సామాజిక న్యాయం అయితే ఆత్మకూరులో బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ఆయన…
ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సరికొత్త సీరీస్ తో రాబోతోంది. ‘మ్యాన్ వర్సెస్ బీ’ పేరుతో రానున్న ఈ సీరీస్ ట్రైలర్ ను ఇటీవల విడుదల చేసింది. ఇందులో మిస్టర్ బీన్ రోవాన్ అట్కిన్సన్ ప్రధాన పాత్ర పోషించారు. తేనెటీగ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తి కథతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ఇది. దీని ట్రైలర్ చూడగానే మన రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా గుర్తుకు రాక మానదు. అంతేకాదు ట్రైలర్‌లోని షాట్స్ కొన్ని ‘ఈగ’లో…
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద కార్మికులకు టీడీపీ, సీపిఐ, సీపీఎం అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని ఆయన మండి పడ్డారు. అధికార దుర్వినియోగం తోనే బూడిద తోట్టెలు కూలిపోయాయని, విద్యుత్ ఉత్పత్తి…
నిన్న ఘర్ణణలో హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య కుటుంబ సభ్యులను ఫోన్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తోంది సామాజిక అన్యాయమని, ఒక పక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పరిసర గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే.. పెద్దపులిని బంధించడానికి ఫారెస్ట్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. పశువులపై చేస్తున్న దాడి పరంపరను కొనసాగిస్తున్న పులి.. ఒమ్మంగి – శరభవరం గ్రామాల మధ్య రాత్రి మరోసారి సంచరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొదురుపాక పొలిమేరలో మరో ఆవు దూడపై పులి దాడి చేసినట్లు సమాచారం. అయితే.. సీసీ కెమెరాల్లో పులి విజివల్స్ రికార్డు అయ్యాయి.…
జల్లయ్య హత్యను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఖండించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యుల పరామర్శించేందుకు పల్నాడుకు బుద్దా వెంకన్న బయలు దేరడంతో.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో బుద్దా వెంకన్నని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందని, హత్యలు చేయమని సీఎం ప్రొత్సహిస్తున్నారన ఆయన ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదని, పల్నాడులో ముగ్గురు…