JP Nadda AP Tour : నేడు, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. అయితే.. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తికేంద్రాలుగా మార్చింది. వాటికి ఇంఛార్జీలను నియమించింది. ఆయా శక్తి కేంద్రాల ఇంఛార్జీలతో విజయవాడలో నడ్డా భేటీ కానున్నారు.
సాయంత్రం 5 గంటలకు విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పుర ప్రముఖులతో జేపీ నడ్డా భేటీ కానున్నారు. అనంతరం రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు జేపీ నడ్డా. అందులో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే… కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ పొత్తులపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుండగా.. ఈ కూటమి నుంచి సీఎం అభ్యర్థిని జేపీ నడ్డా ఈ పర్యటనలో ప్రకటిస్తారమోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!