వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో ఉండాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దోపిడి దొంగల పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ అగ్గి…
సీనియర్ పోలీస్ అధికారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు ఒకేరోజు రెండు అత్యుత్తమ అవార్డులు లభించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం ప్రకటించే ఇండియన్ పోలీస్ మెడల్‌కు డీఎస్ చౌహాన్ ఎంపికయ్యారు. దీంతోపాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు(2024) కూడా ఆయనకు లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును గురువారం నాడు…
ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 10 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణ బలగం అనే పేరుతో BRS సోషల్ మీడియా ఇకపై ఉంటుందన్నారు. జిల్లా కమిటీలు లేవు… వేస్తమని, ఫిబ్రవరి రెండవ వారంలో సార్వత్రిక…
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లోని IFEMAలో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్ లో బుధవారం తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ ను మంత్రి జూపల్లి కృష్ఱారావు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాలను కనుల పండుగగా…
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని అధికార మదంతో రాసిరంపాన పెట్టిన వారిని ఒక చూపు చూడాల్సిందే అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేయని వారికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ పథకాలని గ్రామ నాయకత్వం ద్వారానే ప్రజలకు అందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు .మనకి సహకరించని వారిని మనల్ని ఇబ్బందులు పెట్టిన వారిని రాసి రంపాల పెట్టిన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసాన్నికి ఫిబ్రవరి 5వ తేదీన ఖరారు అయింది. అవిశ్వాసానికి సంబంధించి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావును కలిపి 19 మంది కౌన్సిలర్లకు విప్ నోటీస్ జారీ చేసి చైర్మన్ కు షాక్ ఇచ్చింది. ఇల్లందు మున్సిపల్ లో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో బి ఆర్ఎస్ పార్టీ టికెట్ తో చైర్మన్ తో కలిపి 19మంది వార్డు…
రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమైన పాలన బీజేపీ చేయడం లేదు కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోయింది మోడీ పాలనలో అని, అస్సాంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ.. ఒకప్పుడు కాంగ్రెస్ గూటి పక్షే అని ఆయన వ్యాఖ్యానించారు. మెప్పుకోసం…
తమ నియోజకవర్గాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తమ ఏకైక ధ్యేయమని, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలవడాన్ని తప్పుపట్టలేమని మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టం చేశారు. సంయుక్తంగా విలేకరుల సమావేశంలో సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కె ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), జి మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), మాణిక్ రావు (జహీరాబాద్) మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, ప్రోటోకాల్ సమస్యలకు ప్రాతినిధ్యం వహించేందుకే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని, ఇతర…
లక్డికాపుల్ ని కలెక్టరెట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో ముఖ్య అతిధిగా హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్, రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదిప్ దురశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అడిషనల్ కలెక్టర్ ముధుసుదన్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. హైదరాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై, పెండింగ్ లో ఉన్న పనులపై, వివిధ శాఖల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే…
వివిధ కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ క్లస్టర్, చేరికల సమన్వయ కమిటీ, లబ్దిదారుల సంపర్క్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కమిటీ, యువ సమ్మేళనాలు కమిటీ లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్ ఈ నెల 31 లోపు వాల్ రైటింగ్స్ పూర్తీ చేయాలని ఆదేశించారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 వేల చోట్ల గోడ వ్రాతలు, ప్రతి పోలింగ్…