ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 10 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణ బలగం అనే పేరుతో BRS సోషల్ మీడియా ఇకపై ఉంటుందన్నారు. జిల్లా కమిటీలు లేవు… వేస్తమని, ఫిబ్రవరి రెండవ వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు అని అంటున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలు స్వల్ప తేడాతో ఓటమి చెందామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గాల లో పటిష్టంగా పని చేసి ఉంటే గెలిచే వాళ్ళమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంపై కొద్ది రోజుల్లోనే అసాధారణముగా వ్యతిరేకత వచ్చిందని, హామీలు అడిగితే… మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల మనసులు గాయ పడతాయన్నారు కేటీఆర్. రేవంత్ దావోస్ కు పోయి పచ్చి అబద్ధాలు చెప్పారని, రైతు బంధు ఉండగా… మొదలు పెట్టనీ రైతు భరోసా ఇస్తున్నామని రేవంత్ అంటున్నారన్నారు. ఆత్మ హత్య చేసుకున్న తొమ్మిది మంది ఆటో డ్రైవర్ లను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. కొత్తగా వస్తే… ఎందుకు అడ్డుగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
కేసీఅర్ ను, బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ లు కుమ్మక్కు అయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు లెక్క బెడితే 420 అని వచ్చింది…వాళ్ళను అవమానించే ఉద్దేశ్యం లేదని, అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు ను హై కోర్టు కు ఇవ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ? అని ఆయన ప్రశ్నించారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేదు అని అంటారని, సీఎం కు కొత్త క్యాంపు కార్యాలయం అవసరమా ? అని ఆయన అన్నారు. దావోస్ కు రేవంత్ ఎందుకు వెళ్ళాడు అన్నట్టుగా భట్టి విక్రమార్క మాటల దాడి ఉందని, బహుళ జాతి సంస్థలపై భట్టి విక్రమార్క దుర్మార్గంగా మాట్లాడారన్నారు. ఏ విచారణ అయిన చేసుకోండి…తప్పు చేసిన వారిని దోషిగా నిలబెట్టoడి…అభ్యంతరం లేదని, వచ్చే లోక సభ ఎన్నికలలో బిజెపి ,కాంగ్రెస్ కుమ్మక్కు అవుతాయన్నారు. లోక సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొంటామన్నారు. పార్టీ నిర్మాణం పై ఇక ముందు దృష్టి పెడతామని, చిత్త శుద్ధి ఉంటే పంచాయితీ ఎన్నికలు పెట్టండి…పర్సన్ ఇంఛార్జి ల నియామకం ఎందుకు ? అని ఆయన వ్యాఖ్యానించారు.