కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని అధికార మదంతో రాసిరంపాన పెట్టిన వారిని ఒక చూపు చూడాల్సిందే అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేయని వారికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ పథకాలని గ్రామ నాయకత్వం ద్వారానే ప్రజలకు అందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు .మనకి సహకరించని వారిని మనల్ని ఇబ్బందులు పెట్టిన వారిని రాసి రంపాల పెట్టిన వారిని అధికార మదంతో మన పట్ల దారుణంగా వ్యవహరించిన వారిని ఒక చూపు చూడాల్సిందేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశించి స్పష్టం చేశారు .కష్టకాలంలో ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని వారిని మనం గుర్తుంచుకోవాలని తుమ్మల నాగేశ్వరావు అన్నారు.
నేను అదే పద్ధతి పాటిస్తాను జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా అదే చెప్పాను మన కోసం పనిచేసిన వారికి మనం అండగా ఉండాలని తుమ్మల నాగేశ్వరావు అన్నారు. టిఆర్ఎస్ సన్నాసుల మాదిరిగా మనం ఉండవద్దు. ప్రభుత్వ పథకాలని పేదలకు అందేలా చూడాలి ..ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారు చాలామంది ఉన్నారు ..ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారు పార్టీ కోసం పనిచేశారు త్యాగం చేశారు మహిళా శక్తిని ఎన్నికలలో చూపించారు.. ఎన్నికల్లో ఎన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ కేడర్ లొంగలేదు అందువల్ల కాంగ్రెస్ కేడర్ కోసం మనం పని చేయాల్సిన అవసరం ఉంది మేము అలానే చేస్తాం అంటూ తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ కార్యకర్తలు దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి.