భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసాన్నికి ఫిబ్రవరి 5వ తేదీన ఖరారు అయింది. అవిశ్వాసానికి సంబంధించి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావును కలిపి 19 మంది కౌన్సిలర్లకు విప్ నోటీస్ జారీ చేసి చైర్మన్ కు షాక్ ఇచ్చింది. ఇల్లందు మున్సిపల్ లో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో బి ఆర్ఎస్ పార్టీ టికెట్ తో చైర్మన్ తో కలిపి 19మంది వార్డు కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. మరో ముగ్గురు కౌన్సిలర్లు ఇండిపెండెంట్ గాను, మరో ఇద్దరు కౌన్సిలర్లలో ఒకరు న్యూ డెమోక్రసీ పార్టీ నుండి, మరొకరు సిపిఐ పార్టీ నుండి గెలుపొందారు. అయితే బి ఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన 19 మంది కౌన్సిలర్లలో, చైర్మన్ మరో ముగ్గురు కౌన్సిలర్లు కండువా కప్పుకున్నారు, ఈ నలుగురికి కూడా ఎమ్మెల్యే వీఫ్ జారీ చేయడంతో చర్చకు దారితీసింది .
అయితే ఇండిపెండెంట్గా గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు బి ఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. న్యూ డెమోక్రసీ సిపిఐ పార్టీల నుండి గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో బి ఆర్ఎస్ కమిషనర్లు కోరుకున్న అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంది. బి ఆర్ఎస్ టికెట్ తో గెలిచిన దమాలపాటి వెంకటేశ్వరరావు పై బి ఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసాన్ని కోరుతూ గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అవిశ్వాసాన్ని కోరుతూ జిల్లా కలెక్టర్కు నోటీస్ అందజేశారు. కోర్టును సైతం ఆశ్రయించారు. చైర్మన్ విశ్వాసం పెట్టేందుకు నాలుగు సంవత్సరాలు పూర్తి కావాలని నిబంధన ఉండటంతో కౌన్సిలర్ల ప్రయత్నం ఫలించలేదు.2024 జనవరి 26వ తేదీ నాటికి చైర్మన్ పదవి కాలం ఈ నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నందున గత నెల డిసెంబర్ 12వ తేదీన మరోసారి కలెక్టర్కు అవిశ్వాసాన్ని కోరుతూ నోటీస్ అందజేశారు. దీంతో కలెక్టర్ అవిశ్వాస తీర్మానం కోసం 2024,ఫిబ్రవరి 5వ తేదీ ప్రకటించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అవిశ్వాసాన్ని నెగ్గేందుకు తన భార్యను చైర్మన్గా చేసేందుకు ఓ కౌన్సిలర్ భర్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కౌన్సిలర్లతో బేరసారాలు చేసి దమ్మలపాటి వెంకటేశ్వరరావుకు చైర్మన్లకు పదవి గండం తప్పదనే విధంగా కౌన్సిలర్లను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కొంతమంది కౌన్సిలర్లను క్యాంపు కూడా తరలించాడు. మరో వైపు బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గేలా ప్రయత్నం చేస్తున్నది. చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర మాత్రం జిల్లా కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీదనే ఆశలు పెట్టుకొని తనకు పదవి గండం ఉండకపోవచ్చు అని ఊహిస్తూ ఉన్నాడు. ఈ అవిశ్వాసం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ గా మారిందని చెప్పవచ్చు.