విశాఖలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాద స్థలిని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బృందం పరిశీలించింది. బొత్స వెంట మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు.
Botsa Satyanarayana: విశాఖపట్నం నగరంలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జీవీఎంసీ (GVMC) మేయర్ పీఠం కోసం కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య ఉత్కంఠత పెరుగుతోంది. టీడీపీ, జనసేన కలిసికట్టుగా మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీకి అడ్డుకట్ట వేసేందేకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, దీనిని తిప్పికొట్టేందుకు వైసీపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. Read also: RSS: “దారా షికో”ని…
Botsa Satyanarayana: సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆరోపించారు.
ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరామన్నారు. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదని.. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఏపీలో సినిమాలు తీసేందుకు చాలా లోకేషన్లు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. మండలిలో విశాఖలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. వీటిపై మంత్రి సమాధానాలు…
పాఠశాలల హేతుబద్ధీకరణపై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుధం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా వెనుకబడి పోయాయని, ‘నాడు-నేడు’ పేరుతో విద్యా వ్యవస్థను పతనావస్థకు చేర్చారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మంత్రి లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12…
ప్రభుత్వంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాలలో ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రావటం లేదని ఆరోపించారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు.. తాము 2014 నుంచి మాట్లాడాలని అడిగామని పేర్కొన్నారు. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Botsa Satyanarayana: శాసన మండలిలో వ్యవసాయ సంక్షోభంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.. గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం.. విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించామన్నారు.
శాసనమండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై మంత్రి వంగలపూడి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం.. నేనే అందుకు బాధ్యత తీసుకున్నాను అన్నారు. కానీ, ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైంది. ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని వెల్లడించారు బొత్స..
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ నిరసన దీక్ష చేస్తామన్నారు. శాసన మండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం.. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది.. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు అని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని బొత్స…
MLC Ravindra Babu: ఏపీ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్థసారధి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానిస్తూ.. రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని, ప్రజలు ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్పు ఇచ్చారని అన్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ప్రజలు వైసీపీకి…