మెడికల్ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.
ఏపీ శాసన మండలి సమావేశాలు మొదటి రోజే వాడివేడిగా జరిగాయి. మండలి మొదటి రోజు వాయిదాల పర్వం కొనసాగింది. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చకు వైసీపీ పట్టు పట్టింది.. రైతు సమస్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన తో సభ మొదటి సారి వాయిదా పడింది. మరోవైపు తిరుపతిలో జరుగుతున్న వరుస సంఘటనల పైనా సభలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. తిరుమల సంఘటనలపై మంత్రి ఆనం తీరుకి…
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. రుషికొండ రిసార్ట్స్ ను మెంటల్ హాస్పిటల్ చేయాలన్న వ్యాఖ్యలపై బొత్స ఫైర్ అయ్యారు. అశోక్ వ్యాఖ్యలు అహంకారం, అహంభావానికి నిదర్శనం అని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి వారికి గవర్నర్ పదవి ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ప్రజాధనంతో నిర్మించిన…
ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత…
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నెలలు గడిచిన సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అంటూ బొత్స మండిపడ్డారు. దమ్ములు గురించి మాట్లాడటానికి ఇవి మల్ల యుద్ధాలు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి..అసెంబ్లీ లో తేల్చుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలల్లో రెండు లక్షలు…