Botsa Satyanarayana: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ వైఫల్యం కనిపించడమే కాకుండా ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయి, దిక్కుమాలినిది అయిపోయింది… ఈ స్థాయి కంటే తగ్గి ఇక మాట్లాడలేం… జగన్ వాహనం వల్ల కాదు.. వేరే వాహనం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్పిన తర్వాత మళ్లీ మాట మార్చారు.. చంద్రబాబు తత్వం చూసిన తర్వాత రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు.. ప్రమాదానికి కారణమైన వాహనదారులను పిలిచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన అధికారులు.. మళ్లీ ఎందుకు మాట మార్చారు…? అని నిలదీశారు.. TDP వల్ల వ్యవస్థకు నష్టమని అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ కార్యకర్తలు భావించడమే ప్రభుత్వ వైఫల్యాలుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు.. వైసీపీ అధికారంలో వున్నప్పుడు మూడేళ్ల వరకు టీడీపీ రోడ్డు ఎక్కలేకపోయింది… మరి ఇప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకత? అని ప్రశ్నించారు.
Read Also: Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 10 మంది మృతి.. భారీ భవంతులు ధ్వంసం
నడవడిక మాకు నేర్పాలని చూస్తున్న మంత్రులు గురివింద పూసలాంటి వాళ్ళ పరిస్థితులు గమనించుకోవాలని హితవు చెప్పారు బొత్స.. ముందస్తు సమాచారంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామా… చెప్పండి..? అని ప్రశ్నించారు.. కాన్వాయ్, ఎస్కార్ట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు రోప్ పార్టీ ఏమైపోయింది..!?. ఎక్కడ ఉంది మీ పోలీస్ వ్యవస్థ..!! అని నిలదీశారు.. అక్కసు, దుర్మార్గమైన ఆలోచనతో మార్పులు చేసి గజకర్ణ విద్యలు ప్రదర్శిస్తున్నారు.. ఐదేళ్లలో ప్రమాదాలు కారణంగా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు ఎన్నడైనా ఆదుకున్నారా..? అని మండిపడ్డారు.. వెనక్కి తిరిగి చూసుకుంటే మంత్రుల సచ్చీలత ఏ పాటితో అర్ధం అవుతుందన్నారు. ఇక, పీ4 ఓన్లీ పబ్లిసిటీ మాత్రమే… యోగా దినోత్సవం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యక్తిగత ఆనందం, పబ్లిసిటీ కోసం చేయడం కరెక్టేనా…? అని ఫైర్ అయ్యారు. పబ్లిసిటీ కోసం చేసిన ప్రయత్నం వల్ల విశాఖకు ఏమి ఒనగూరిందో చెప్పగలరా..? ఏదైనా కార్యక్రమం వల్ల జాకీలు ఎత్తడం కాదు ప్రయోజనం కనిపించాలి.. రుషికొండ వల్ల ఒక మాన్యుమెంట్ రూపుదిద్దుకుంది.. తప్పులు జరిగినట్టే నిరూపించి శిక్షించండి.. యోగాడే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ కారు ప్రమాదంను తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు..
Read Also: Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే!
యువత ఆందోళనలపై లాఠీఛార్జ్ దుర్మార్గం… మెడలు వంచైనా హామీలు అమలు చేయిస్తాం అన్నారు బొత్స సత్యనారాయణ.. తాట తీస్తాం, భూ స్థాపితం అంటన్నారు విలువ తగ్గించుకునే మాటలు పునరావృత్తం చేయవద్దని సూచిస్తున్నాను.. మేనిప్లేషన్ చేసి రాజకీయాలను తప్పుదారి పట్టించవొద్దు.. ప్రజానాయకుడు బయటకు వచ్చిన ప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు వస్తే బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం పోలీసులు బాధ్యత కదా..? అని ప్రశ్నించారు.. AI, వీడియోలు, టెక్నాలజీల గురుంచి నేను మాట్లాడను… ఎస్పీ చెప్పిన సమాచారం ఇక్కడ ప్రధానం అన్నారు.. గాయపడిన వ్యక్తిని ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తీసుకుని వెళ్లకుండా ఎస్సై రాజశేఖర్ అడ్డుకున్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు.. ఇక, జగన్మోహన్ రెడ్డి మీద కూటమి నేతలు ఎప్పుడు మాట్లాడతారా? అని షర్మిళ ఎదురు చూస్తుంటుంది.. అలా మాట్లాడటం పాపం నేను వున్నానని ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగమే అన్నారు.. యోగాంధ్ర గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బోగస్.. 2 లక్షల 40 వేల మంది హాజరయ్యారని అధికారులు చెబితే.. మూడు లక్షలు దాటిందని గిన్నీస్ బుక్ వాళ్ళు చెప్పారు… దీంట్లో ఏది నిజం…? అని ప్రశ్నించారు.. యోగాడే వల్ల రాష్ట్రానికి, విశాఖకు ఒరిగిందేమీ లేదు.. కానీ, దానిని కప్పిపు చ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..