ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నెలలు గడిచిన సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అంటూ బొత్స మండిపడ్డారు. దమ్ములు గురించి మాట్లాడటానికి ఇవి మల్ల యుద్ధాలు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి..అసెంబ్లీ లో తేల్చుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలల్లో రెండు లక్షలు…
Botsa Satyanarayana: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందుల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేసింది.. ఎన్నికలు అంటే ప్రభుత్వానికి ఎందుకు భద్రతాభావం కలుగుతుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
బొత్స సత్యనారాయణ.. ఉత్తరాంధ్రలో కీలక నేత.. అక్కడ వైసీపీకి పెద్ద దిక్కు. ఉమ్మడి రాష్ట్రంలోను, విడిపోయాక కూడా పవర్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారాయన. ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన కొద్దిమంది నేతల్లో ఆయన కూడా ఒకరు.
Botsa Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు.
Botsa Satyanarayana: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి త్రికరణశుద్ధితో చెప్పిన హామీలు.. 13 నెలలు అయినా ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరుపున అడిగే హక్కు ఉంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పోలీస్ వైఫల్యం కనిపించడమే కాకుండా ఆ తర్వాత పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయి, దిక్కుమాలినిది అయిపోయింది... ఈ స్థాయి కంటే తగ్గి ఇక మాట్లాడలేం... జగన్ వాహనం వల్ల కాదు.. వేరే వాహనం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్పీ చెప్పిన తర్వాత మళ్లీ మాట…
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒక్కసారిగా కుప్పకూలారు. బొత్స అస్వస్థతకు గురవడంతో వైసీపీ నేతలు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీపీ తగ్గడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. గరివిడి నుంచి విజయగరంకు బొత్స బయల్దేరారు. వైసీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. చీపురుపల్లిలోని ఆంజనేయపురం నుంచి స్థానిక మూడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో…