Botsa Satyanarayana: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తే తాట తీస్తాం, మక్కెలు ఇరగ కొడతాం అంటున్నారు.. కానీ, ప్రశ్నించకపోతే పనే చేయడం లేదన్నారు.. బాబు మేనిఫెస్టో గుర్తు చేసే కార్యక్రమం చేపట్టాం.. కూటమి ప్రభుత్యంపై బురదజల్లడం వైసీపీ ఉద్దేశం కాదు అన్నారు.. ప్రభుత్యం హామీలు అమలు చేయక పోతే ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది.. మాయ, మోసం చేయటం లేదా, దగా చేయటం లేదా..? మిమ్ములను ఎందుకు నిలదీయకూడదు..? అని మండిపడ్డారు బొత్స..
Read Also: IND vs ENG Test: డబుల్ సెంచరీ దిశగా గిల్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న జడేజా..!
మేం అడగక పోతే తల్లికి వందం వేసేవారా? అని ప్రశ్నించారు బొత్స.. అరెస్టులకు, తాటకుచప్పులకు భయపడం అని స్పష్టం చేశారు. మేం మేనిఫెస్టోను భగవద్గీతగా భావించి అమలు చేశాం. అందుకే, మీరు ఎన్నికల్లో ఇచిన మేనిఫెస్టో అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు.. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాం అన్నారు.. మరి ఏంమైంది అని ప్రశ్నించారు.. ఇక, సీఎం చంద్రబాబు 100 అబద్ధాలు చెబితే, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ 200 అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.. 43 శాతం పైగా ఓటింగ్ వచ్చినా ఏదో జరిగా ఓడిపోయాం.. మేం ప్రజల్లో తేల్చుకుంటాం అన్నారు బొత్స.. మరోవైపు, పక్కన ఉన్న విశాఖకు విమానాలు తగ్గిస్తే దిక్కులేదు.. కానీ, కర్నూలుకు విమానాలు తెస్తాం అంటారని విమర్శించారు.. జగన్ పరామర్శలకు వెళ్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు, మహిళలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి తిరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ.