Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్‌లోని న్యాయమూర్తుల విభా కంకన్‌వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
‘‘నాలుగేళ్ల చిన్నారి తల్లికి దూరంగా ఉంచడం కూడా మానసిక వేధింపులతో సమానం. అది తల్లి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. ఇది కూరత్వానికి సమానం’’ అని పేర్కొంది. అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద క్రూరత్వమే అని చెప్పింది. మానసిక వేధింపులు రోజు రోజుకు కొనసాగుతున్నాయని ఇది తప్పు అని ధర్మాసనం పేర్కొంది. అత్తమామలపై ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయలేమని చెప్పింది.
Read Also: Bashar al-Assad: సిరియా నుంచి బషర్ అల్ అస్సాద్‌ని రక్షించిన రష్యా సీక్రెట్ ప్లాన్..
మహారాష్ట్ర జల్నా జిల్లాలో మహిళ తన అత్తామామలు, ఆడపడుచుపై వేధింపుల కేసు పెట్టింది. 2022లో నమోదైన ఈ కేసుని రద్దు చేయాలని వారు కోర్టుని ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. బాధిత మహిళకు 2019లో వివాహం జరిగింది. 2020లో ఒక కుమార్తె జన్మించింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. మే 2022లో సదరు మహిళ అత్తగారి ఇంటి నుంచి బయటకు నెట్టారు. తన కుమార్తెని తీసుకెళ్లడానికి అనుమతించలేదని ఆమె ఆరోపించింది.
దీంతో మహిళ తన బిడ్డను తనకు అప్పగించాలని మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023లో పిల్లల సంరక్షణ తల్లికి అప్పగించాలని కోర్టు భర్తని ఆదేశించింది. అయితే, భర్త, అతడి కుటుంబీకులు ఈ ఉత్తర్వులను పాటించకుండా, బిడ్డను తన వద్దే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో బిడ్డ భర్త వద్ద ఉన్నాడని తెలిసీ కూడా మహిళ అత్తమామలు ఆయనకు రహస్యం సహకరిస్తున్నారని బెంజ్ పేర్కొంది. న్యాయశాఖ ఆదేశాలు గౌరవించని వారు ఉపశమనానికి అర్హులు కాదని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ వ్యాఖ్యానించింది.