Saibaba: మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
- మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
- నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
- మావోలతో సంబంధాలున్నాయని తేల్చిన కోర్టు
- జైలు శిక్ష అనుభవిస్తుండగా నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా తుదిశ్వాస విడిచారు. ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2017లో జీవిత ఖైదు విధించిన గడ్చిరోలి కోర్టు.. నాగపూర్ జైల్లో శిక్ష అనుభవించారు. అనంతరం బాంబే హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా శనివారం నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సాయిబాబా మృతి పట్ల ప్రజాసంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: PM Internship scheme: పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ ప్రారంభం
Also Read
ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పని చేశారు. సాయిబాబాను 2014లో మావోయిస్టు గ్రూపులతో సంబంధాలున్నాయనే అనుమానంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన తర్వాత యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయ్యారు. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో నిర్బంధించారు. మార్చి 2017లో మహారాష్ట్ర సెషన్స్ కోర్టు సాయిబాబాకు మరో ఐదుగురు మావోయిస్టులు మహేష్ తిర్కీ, పాండు నరోటే, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీతో సంబంధాలు ఉన్నాయని తేల్చింది. దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్లు భావించే కార్యకలాపాలలో పాల్గొన్నందుకు దోషులుగా నిర్ధారించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాకు ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో విడుదలయ్యాడు.
ఇది కూడా చదవండి: PM Internship scheme: పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ ప్రారంభం
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!