Bombay High Court: ఒక బాలికను ఫాలో అయ్యాడనే ఒకే ఉదాహరణ అనేది ఐపీసీ సెక్షన్ 354(D) ప్రకారం ఒక బాలికను స్టాకింగ్(వెంబడించడం) చేశాడనే నేరంగా పరిగణించబడటానికి అనుగుణంగా లేదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలికకు సంబంధించిన కేసులో లైంగిక వేధింపులు, అతిక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు 19 ఏళ్ల యువకులకు సంబంధించిన పిటిషన్ల జస్టిస్ జీఏ సనప్ విచారించారు.
ఒక అమ్మాయిని అనుసరించాడనే ఒకే ఒక్క ఉదాహరణ ఐపీసీ కింద స్టాకింగ్(వెంబడించడం)గా వర్గీకరించబడదని జస్టిస్ సనప్ తీర్పు చెప్పారు. ఈ కేసు జనవరి 2020 నాటిది, నిందితుడు బాలిక ఇంట్లోకి చొరబడి, ఆమె గొంతును పట్టుకుని, ఆమెను అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో రెండో నిందితుడు ఇంటి బయట ఉన్నాడని ఆరోపించబడింది. ప్రాథమిక నిందితుడు మైనర్ బాలికను అనుసరించి ఆమెను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. బాలిక స్పష్టంగా తిరస్కరించింది. బాలిక తల్లి నిందితుడి కుటుంబానికి చెప్పినప్పటికీ, ఆమెని వేధిస్తూనే ఉన్నాడు.
Read Also: Israel: మొస్సాద్ గూఢచారిని బహిరంగంగా ఉరితీసిన సిరియా.. మృతదేహం కోసం ఇజ్రాయిల్ చర్చలు..!
ట్రయల్ కోర్టు ఇద్దరు వ్యక్తులను IPC, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద అనేక ఆరోపణలపై దోషులుగా నిర్ధారించింది. ఆరోపణల్లో వేధించడం, లైంగిక వేధింపులు, ఇంటికిలో ప్రవేశించడం, నేరపూరిత బెదిరింపులు ఉన్నాయి. నిందితులు బాలిక నదికి వెళ్తున్న క్రమంలో ఆమెను ఫాలో అయిన ఒకే ఒక్క సంఘటన మాత్రమే వెంబడించినట్లు ఆరోపిస్తోందని హైకోర్టు గుర్తించింది.
సెక్షన్ 354(D) కింద వెంబడించడం అనేది భౌతిక లేదా డిజిటల్ మార్గాల ద్వారా బాధితురాలిని అనుసరించడం, చూడటం లేదా సంప్రదించేందుకు ప్రయత్నించడం వంటి మళ్లీ మళ్లీ చేసే నిరంతర చర్యలకు రుజువులు అవసరమని జస్టిస్ సనప్ కుమార్ స్పష్టం చేశారు. రెండో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. ఇంటి బయట కాపలాగా నిలబడటానికి మించిన ఆరోపణలు లేకపోవడంతో అతడిపై అన్ని కేసులు కొట్టేసింది. మొదటి నిందితుడి లైంగిక వేధింపుల శిక్షను సమర్థించింది. అయితే, అతని చిన్న వయస్సు మరియు అతను ఇప్పటికే కస్టడీలో గడిపిన రెండున్నరేళ్లను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు ప్రధాన నిందితుడి శిక్షను సవరించింది.