live-in relationship: లివ్ ఇన్ రిలేషన్ కొనసాగించడానికి పోలీసుల రక్షణ కోసం పిటిషన్ దాకలు చేసిన జంటపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. కలిసి జీవించేందుకు పోలీసులు రక్షణ కల్పించడమేంటని న్యాయమూర్తులు భారతీ డాంగ్రే, మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం పేర్కొంది. 19 ఏళ్ల హిందూ యువతిని ప్రభుత్వ షెల్టర్ హోమ్ నుంచి విడుదల చేయాలని కోరతూ 20 ఏళ్ల ముస్లిం యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. పిటిషన్‌తో కలిసి జీవించేందుకు యువతి ఆమె తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి, ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను షెల్టర్ హోంలో ఉంచారు.
పిటిషన్‌తో సంబంధం తెంచుకోవాలని మహిళపై ఒత్తిడి తెవడం, బజరంగ్ దళ్, ఇతర సామాజిక రాజకీయ వర్గాల వల్ల తల్లిదండ్రుల ఫిర్యాదు ప్రభావితమైందని పిటిషన్ పేర్కొంది. యువతి పోలీస్ స్టేషన్‌లో కూడా తన ప్రియుడితో సంబంధాన్ని విడిచిపెట్టమని బెదిరింపులు, బలవంతానికి గురి చేశారని, అయితే అతడిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తి చేసి, కుటుంబం వద్దకు తిరిగి వెళ్లేందుకు యువతి నిరాకరించినట్లు పేర్కొంది. యువతి తండ్రి తరుపున వాదిస్తున్న న్యాయవాది సనా రయీస్ ఖాన్.. యువకుడికి వివాహ వయస్సు లేనందున పిటిషన్ కొనసాగించొద్దని వాదించాడు. భారత్‌లో పురుషులు కనీస వివాహ వయసు 21 ఏళ్లు.
Read Also: Deputy CM Pawan Kalyan: మంత్రులు, ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్..
అయితే, కోర్టు మాత్రం యువతి మేజర్ అని ఆమె స్వయంప్రతిపత్తిని నొక్కి చెప్పింది, తల్లిదండ్రులతో ఉండాలని ఆమెను బలవంతం చేయలేని చెప్పారు. ‘‘ మేము ఆమెను విడిపించినట్లయితే, ఆమె మీతో ఉండటం ప్రారంభిస్తే ఆమెకు ఎవరు భద్రత కల్పిస్తారు..?’’ అని జస్టిస్ డాంగ్రే ప్రశ్నించారు. ‘‘మీరు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీ ఇంటి ముందు పోలీసులు బలగాలని మోహరించాలనుకుంటున్నారా..? పోలీసులకు ఇంతకంటే ఏం పని లేదా.? మేము మీకు పోలీస్ రక్షణ కల్పిస్తామని ఆశించొద్దు’’ అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సామాజిక నిబంధనల్ని సవాల్ చేసి, వ్యక్తిగత ఎంపికలను తీర్చుకోవడానికి రాష్ట్ర వనరులను ఖర్చు చేయలేమని పేర్కొంది.
న్యాయమూర్తులు యువతి మునుపటి ప్రవర్తనను కూడా వివరించారు. ఆమె తిరుగుబాటు స్వభావం కలిగిన వ్యక్తిగా అభివర్నించారు. జస్టిస్ డాంగ్రే మాట్లాడుతూ.. స్త్రీ ‘‘కల్పిత ప్రపంచం’’లో జీవిస్తున్నారని, ఆమె జీవిత వాస్తవాల కోసం సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారని పేర్కొన్నారు. లివ్ రిలేషన్ గురించి కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ అబ్బాయి మిమ్మల్ని గర్భవతిని చేస్తే ఏం చేస్తారు..?’’అని ప్రశ్నిస్తే, యువతి నేను బ్రతకగలుగుతాను అని చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉంటే, తన తండ్రి ఆస్తిపై ఎలాంటి హక్కు పొందకూడదని అంగీకరించేలా బలవంతం చేస్తున్నారని, తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిని ఏర్పాటు చేశారంటూ సదరు యువతి కోర్టులో ప్రస్తావించింది. దీనికి బదులుగా కోర్టు..‘‘నువ్వు ఎప్పుడూ పెళ్లి నుంచి పారిపోవచ్చే. రెండు సార్లు పారిపోయావు.’’ అని చెప్పింది. ఆమె తన నిర్ణయాన్ని పునఃపరిశీలించిందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఆ మహిళ తండ్రిని షెల్టర్ హోమ్‌లో కలవడానికి కోర్టు అనుమతించింది. అయితే, ప్రియుడి కస్టడీకి యువతిని అప్పగించేందుకు నిరాకరించింది. పోలీసులు రక్షణ కల్పించడానికి ఒప్పుకోలేదు.