మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం చీలికల దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ‘వై’ భద్రతను దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యింది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఎమ్ఐఎమ్ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లతో కలిపి 17 నామినేషన్లు దాఖలయ్యాయి.. 15 మంది సభ్యులు ఉండే స్టాండింగ్ కమిటీకి బీఆర్ఎస్ ఉపసంహరణతో ఎన్నిక లేకుండా ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ సభ్యులతో ఏకగ్రీవమైంది..…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మీడియా కోడైకూసింది.
NDA CMs Key Meeting: ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దేశ రాజధానిలోని ఓ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.
Delhi CM Rekha Gupta: ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాంలీలా మైదానంలో ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 12:35 గంటలకి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె సీఎం పదవిని చేపట్టారు. రామ్‌లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమం జరిగింది.
Delhi Assembly speaker: ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ.. అసెంబ్లీ స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ తరపున రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా నామినేట్ అయ్యారని పార్టీ నాయకులు తెలిపారు.
Rekha Gupta: అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో శీష్ మహల్ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఆ భవనాన్ని మ్యూజియంగా మారుస్తామని ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తాం..